Micro Robots: సమస్యలకు సరికొత్త చికిత్స.. మైక్రో రోబోలతో సమస్యలు క్లియర్

Micro Robots: సీజన్ మారితే చాలు కొందరికి జలుబు, దగ్గు వంటివి వస్తుంటాయి. ముఖ్యంగా వీరికి సైనస్ వంటివి వస్తాయి. ఈ సమస్య ఉన్నవారు అసలు చల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోలేరు. అయితే ఈ సమస్య ఉంటే తప్పకుండా మందులు వాడాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. అయితే ఇదంతా కూడా ఇప్పటి వరకు మాత్రమే. ఇకపై సైనస్ ఇన్ఫెక్షన్‌కు ఎలాంటి మందులు లేకుండా ఈజీగా తగ్గించవచ్చు. సూక్ష్మ రోబోల సాయంతో డైరెక్ట్‌గా సైనస్ ఉండే దగ్గరకు ఔషధాన్ని పంపుతున్నారు. దీనివల్ల ఇంకా ఎలాంటి మందులు కూడా వాడక్కర్లేదు. కేవలం ఇవే కాకుండా మాత్రలు, యాంటీబయాటిక్స్ కాకుండా సూక్ష్మ రోబోలను డాక్టర్లు ఉపయోగించనున్నారు. ఈ కొత్త సాంకేతికత వల్ల సైనస్ ఇన్‌ఫెక్షన్లు అన్ని కూడా తగ్గుతాయి. అయితే ప్రస్తుతం సైనస్ ఇన్‌ఫెక్షన్లకు ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. అయితే ఇవి శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియాలను కూడా పూర్తిగా నాశనం చేస్తాయి. అయితే కొన్నిసార్లు ఈ ఇన్‌ఫెక్షన్లు బయోఫిల్మ్‌లు వచ్చేలా చేస్తాయి. అయితే వీటిపై యాంటీబయాటిక్స్ ప్రభావం అసలు ఉండదు. అదే ఇందులో ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ మైక్రో-రోబోలు అయితే శరీరంలోకి వెళ్లిన తర్వాత ఇన్‌ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో ఔషధాలను విడుదల చేసి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
Read Also:Smartphone : ఫోన్లో ఎవరు ఏం చూశారో మొత్తం బయటపడుతుంది.. ఈ ట్రిక్ వెంటనే ట్రై చేయండి
చూడటానికి ఈ రోబోలు చాలా సన్నగా ఉంటాయి. నిజానికి మన కంటికి కనిపించే జట్టు కంటే సన్నగా ఉంటాయి. వీటితోనే డాక్టర్లు సైనస్ సమస్యను తగ్గించగలరు. అయితే ఇవి ఆ ప్రాంతంలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగిస్తాయి. దీంతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. దీనివల్ల మళ్లీ ఎలాంటి సమస్య కూడా రాదు. భవిష్యత్తులో కూడా మళ్లీ సైనస్ ఇన్‌ఫెక్షన్లు అసలు రావు. సైనస్ సమస్య ఉన్నవారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వీరు ఎక్కువగా చల్లని పదార్థాలు తీసుకోరు. కాస్త తీసుకుంటే చాలు మళ్లీ సైనస్ సమస్య పెరుగుతుంది. దీంతో అది తీవ్రమై ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అయితే సైనస్ సమస్య ఉన్నవారు తప్పకుండా వేడి నీరు తీసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు వేడి నీటి ఆవిరి పీల్చాలి. దీనివల్ల ముక్కు దిబ్బడ నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. అలాగే ముక్కును ఎప్పటికప్పుడు వెచ్చని నీటితో కడగాలి. అలాగే సెలైన్ నీటితో కూడా కడగాలి. దీనివల్ల ముక్కు సమస్యలు అసలు ఉండవు. జలుబు చేస్తుందని తక్కువగా నీరు తాగకూడదు. కాస్త ఎక్కువగానే నీరు తాగుతుండాలి. అలాగే బాడీకి కూడా సరిపడా విశ్రాంతి ఉండాలి. దీనివల్ల శరీరానికి ఎలాంటి సమస్యలు కూడా రావు. సైనస్ ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.