Dhoni Youth Fitness: యువత ఫిట్ నెస్ పై ధోని సంచలన కామెంట్స్
Dhoni Youth Fitness ధోని 2020లోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంకా ఫిట్ గా ఉన్నాడు.

Dhoni Youth Fitness: యువత ఫిట్ నెస్ పై ధోని సంచలన కామెంట్స్ చేశాడు. దేశ యువతలో సగటు ఫిట్ నెస్ లెవల్ తగ్గిపోతుందని మహేంద్ర సింగ్ ధోని ఆందోళన వ్యక్తం చేశాడు. ఫిట్ గా ఉండాలంటే శారీరకంగా శ్రమించాలని ఆయన ఓ ఈవెంట్ లో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతీయుల సగటు ఆయు ప్రమాణం తగ్గుతోంది. శారీరకంగా కష్టపడడం లేదని.. తన కుమార్తె కూడా శారీరకంగా పెద్దగా శ్రమించడం లేదని అన్నాడు. అయితే ధోని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధోని 2020లోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంకా ఫిట్ గా ఉన్నాడు. 44 ఏళ్ల వయసులో కూడా ధోనీ మైదానంలో చురుకుగా ఉంటున్నాడు. అయితే ధోని చెప్పిన ఫిట్ నెస్ సూత్రం అందరికీ ఉపయోగపడుతుంది. ధోని తన కూతురు గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని 44 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా 5 ట్రోఫీలు అందించాడు.