RCB Vs CSK 2025: మ్యాచ్ ఓడినా.. ధోనీ సెన్సెషనల్ రికార్డు క్రియేట్
RCB Vs CSK 2025 ఐపీఎల్‌లో చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డులో మొదటి ప్లేస్‌లో సురేష్ రైనా ఉన్నాడు. ఇతను 171 ఇన్నింగ్స్‌లలో 4687 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు.

RCB Vs CSK 2025: టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో అలరిస్తున్నాడు. అత్యంత ఖరీదైన జట్లలో ఒకటైనా చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున ఆడుతున్నాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచింది. అయితే చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. సొంత గడ్డపై చెన్నై ఓడిపోయింది. ధోనీ జట్టు ఓడిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రాయల్స్ బెంగళూరు జట్టు కంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎక్కుగా ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం అందులో ఎంఎస్ ధోని ఉండటమే. ఈ స్టేడియంలో ధోని ఆట చూడటానికి ఎందరో అభిమానులు వెళ్తుంటారు. అయితే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయినా కూడా ధోని రికార్డు క్రియేట్ చేశాడు. చెపాక్ మైదానంలో ఐపీఎల్‌లో చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసి ఎంఎస్ ధోని రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డులో మొదటి ప్లేస్‌లో సురేష్ రైనా ఉన్నాడు. ఇతను 171 ఇన్నింగ్స్‌లలో 4687 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌తో ధోని సురేష్ రైనాని బీట్ చేశాడు. మొత్తం 204 ఇన్నింగ్స్‌లలో 4695 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు.
ఇదిలా ఉండగా రాయల్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. అయితే 2008 తర్వాత చెన్నై జట్టును బెంగళూరు ఓడించడం మళ్లీ ఇదే. రజత్ పటిదార్ కెప్టెన్సీలో సొంత గడ్డపై బెంగళూరు జట్టు ఓడించింది. అయితే ధోని మొదటిలో కాకుండా మ్యాచ్ చివరిలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 197 పరుగులు చేసింది. వీటిని ఛేదించే క్రమంలో సీఎస్‌కే జట్టు 75 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి సమయంలో ధోని క్రీజులోకి రాలేదు. ఈ సమయంలో వచ్చి ఉంటే సీఎస్‌కే గెలిచి ఉండేదందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ తర్వాత ఆరో వికెట్ పడినప్పుడు కూడా ధోని వస్తాడని అందరూ భావించారు. కానీ ఆ సమయంలో కూడా ధోనీ రాలేదు. చివరగా 9వ స్థానంలో అశ్విన్ ఔట్ అయిన తర్వాత ధోని బరిలోకి వచ్చాడు. అయితే చివరలో ధోని బ్యాటింగ్ చేసినా రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. మొత్తం 10 బంతుల్లో 30 పరుగులు చేసి రికార్డు క్రియేట్ అయితే చేశాడు. కానీ చెన్నై జట్టు మాత్రం మ్యాచ్ ఓడిపోయింది.
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?