Gaming Mobiles: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Gaming Mobiles: ఈ మధ్య కాలంలో కొందరు మొబైల్స్‌కి బానిస అవుతున్నారు. ముఖ్యంగా యూత్ అయితే ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారు. కొందరు సిస్టమ్‌లో గేమ్ ఆడితే మరికొందరు మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్నారు. కొన్ని మొబైల్స్ గేమ్స్ ఆడితే తొందరగా పాడవుతాయి. అయితే ఎక్కువగా గేమ్స్ ఆడినా కూడా మొబైల్స్ పాడవకుండా ఉండే కొన్ని స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వీటలో గేమ్స్ ఆడటం వల్ల తొందరగా మొబైల్స్ పాడవ్వవు. అందులోనూ ఎక్కువ ఖరీదు కాదు.. కేవలం తక్కువ ఖరీదులోనే బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మరి అవేంటి? ఏ కంపెనీ మోడల్ ఉన్నాయి? వీటి ధరలు ఎలా ఉన్నాయనే పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోకో ఎక్స్6 ప్రో
గేమింగ్‌కి పోకో ఎక్స్6 ప్రో బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్‌కి 6.67 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. అలాగే 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఉంది. ఈ మొబైల్ మాలి-జీ615 జీపీయూతో పనిచేస్తుంది. అలాగే దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో ఉన్న 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో ఎక్స్ 6 ప్రో కూడా ఉంది. అయితే సెల్ఫీ కోసం ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.
ఐక్యూ జెడ్9
ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 6.67 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వైబ్రెంట్ కలర్స్, ఫ్లూయిడ్ విజువల్స్‌తో ఉంది. అలాగే రియర్ కెమెరా సెటప్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరాలో 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది.
రియల్మీ నార్జో 70 టర్బో
ఇందులో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్‌ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఇందులో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ని అమర్చారు. అలాగే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2 మెగా పిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉన్నాయి. అలాగే డ్యూయెల్ కెమెరా సెటప్ కూడా ఉంది. దీనికి 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్
ఇందులో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఉంది. అలాగే 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో పాటు 2,100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై ఈ మొబైల్ వర్క్ కానుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో
ఈ మొబైల్ గేమ్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. గేమ్స్ ఆడినా కూడా తొందరగా హ్యాంగ్ కాదు. ఇందులో 6.4 ఇంచ్ డిస్‌ప్లే కూడా ఉంది.