Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Luxury Items Mostly Buy Middle Class

Luxury items: లగ్జరీ వస్తువుల ట్రాప్‌లో పడుతున్న మిడిల్ క్లాస్

Luxury items: లగ్జరీ వస్తువుల ట్రాప్‌లో పడుతున్న మిడిల్ క్లాస్
  • Edited By: kusuma,
  • Updated on May 18, 2025 / 03:09 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Luxury items: లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసి రిచ్‌గా కనిపించాలని చాలా మంది భావిస్తారు. ఈ లగ్జరీ వస్తువులను ధనవంతులు కంటే మధ్య తరగతి వారే ఎక్కువగా కొంటున్నారు. పేదవారు ఎలా ఉన్నా ఉండగలరు. ధనవంతులు కూడా ఉండగలరు. కానీ మధ్య తరగతి ప్రజలు గొప్పలకు పోయి.. అప్పు చేసి మరి లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత అయితే రిచ్‌గా కనిపించాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగం చేసే మిడిల్ క్లాస్ వారు ఈఎంఐ పెట్టి మరి ఖరీదైన ఫోన్లు, వస్తువులు, కార్లు ఇలా ఎన్ని ఉంటే అన్ని కొనుగోలు చేస్తున్నారు. అది కూడా సేవింగ్ చేసిన డబ్బులతో కాకుండా ఈఎంఐలోనే కొంటున్నారు. అయితే 75 శాతం లగ్జరీ వస్తు్వులను కొనుగోలు చేసేది మిడిల్ క్లాస్ వారేనని మార్కెట్ ఎక్స్‌పర్ట్ అభిజిత్ చోక్సీ తెలిపారు. లగ్జరీ వస్తువుల ధరలు తగ్గలేదని, రిచ్‌గా కనిపించాలని మిడిల్ క్లాస్ వారు అప్పులు చేసి మరి కొంటున్నారని అన్నారు. లగ్జరీ వస్తువులకు మిడిల్ క్లాస్ వారు బానిస అవుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఇది ఒక ట్రాప్‌లా మారిందని తెలిపారు.

Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?

ఉదాహరణకు తీసుకుంటే ప్రస్తుతం రోజుల్లో మిడిల్ క్లాస్ వారు రిచ్‌గా కనిపించాలని ఐఫోన్ వాడుతున్నారు. అయితే ఈ ఫోన్‌ను డబ్బులు సేవ్ చేసి కొనరు. ఈఎంఐలోనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ప్రతీ నెలా కూడా అప్పులు పెరుగుతాయి. వడ్డీలు పెరుగుతుంటాయి. అయినా కూడా పట్టించుకోకుండా చాలా మంది అప్పులు చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ ట్రాప్‌లో పడి సంతోషాన్ని దూరం చేసుకుంటున్నారు. పేదవారిగా ఉన్న పర్లేదు. కొనడానికి స్తోమత లేకపోతే అప్పులు చేయరు. లగ్జరీ లైఫ్ కోసం పెద్దగా ఆశలు పెట్టుకోరు. కానీ మధ్య తరగతి ప్రజలుగా ఉండటం చాలా కష్టం. మధ్య తరగుతులకు చాలా కోరికలు ఉంటాయి. వీటిని తీర్చుకోవడానికి కష్టాలు పడతారు. లగ్జరీ లైఫ్ కోసం ఇష్టం లేకపోయినా కూడా కొన్ని వస్తు్వులు కొనుగోలు చేస్తుంటారు. ఇతరులు కొన్నారని గొప్ప కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎక్కువగా గొప్పల కోసం జీవిస్తుంటారు. సంతోషంగా లైఫ్‌లో ఉండాలి. అంతే కానీ లగ్జరీ లైఫ్‌ కోసం ఆరాట పడి జీవితంలో హ్యాపీనెస్ లేకుండా చేసుకుంటున్నారు.

Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!

ఇలా ధనవంతుల కంటే మధ్య తరగతి వారే ఎక్కువగా ఉన్నారు. కొందరు ధనవంతులు చాలా సింప్లీగా ఉంటారు. ఎక్కువ ఖర్చులు చేయరు. అందరిలో గొప్పగా కనిపించాలని ప్రయత్నించరు. ఎంతో సింపుల్‌గా హుందాగా ఉంటారు. కానీ మధ్య తరగతి ప్రజలు లగ్జరీ లైఫ్‌ను కోరుకుంటారు. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి. అంతే కానీ లేని పోని వాటిని కోరుకుని హ్యాపీగా ఉన్న లైఫ్‌ను కోల్పోకూడదు

Tag

  • Costly
  • Luxury items
  • middle class
  • Mobiles
Related News
  • Mango: వామ్మో ఒక్కో మామిడి పండు ధర రూ.10 వేలు

  • Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!

  • Google pixle: 16జీబీ ర్యామ్ గూగుల్ ఫోన్‌పై రూ.17,000 తగ్గింపు..!

  • Motorola: మోటారోలా నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు

  • Gaming Mobiles: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us