Mango: వామ్మో ఒక్కో మామిడి పండు ధర రూ.10 వేలు

Mango: వేసవిలో మామిడి పండ్లు విపరీతంగా లభిస్తాయి. ఈ మామిడి పండ్ల కోసమే చాలా మంది ఎదురు చూస్తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అయితే మామిడి పండ్లు సాధారణ ధరలే ఉంటాయి. ఒక్కో పండు బట్టి ఉంటుంది. సాధారణంగా మార్కెట్‌లో కిలో మామిడి పండ్లు రూ.100 లేదా రెండు వందలకు లభిస్తాయి. మరీ అయితే వెయ్యి రూపాయలు. కానీ ఇంత కంటే ఎక్కువగా ఉండటం కష్టం. అయితే మహారాష్ట్రలోని ఓ మహిళ రూ.10 వేల రూపాయల మామిడి పండును సాగు చేసింది. ప్రస్తుతానికి దేశంలో ఎక్కువ ధర పలికిన మామిడి పండు ఇదే. అయితే ఇంతకీ ఎవరీమె? ఏ జాతి రకం మామిడి పండ్లను పండించింది? ఎందుకు ఈ మామిడి పండ్లు ఇంత ఖరీదు? ఈ స్టోరీలో చూద్దాం.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉంటున్న ఓ మహిళా రైతు ఇంతటి ఖరీదైన మామిడి పండును సాగు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ రకానికి చెందినది ఈ మామిడి పండు. దీన్ని సాగు చేసి ఇటీవల జరిగిన వ్యవసాయ క్షేత్రంలో రూ.10 వేలకు అమ్మారు. అయితే ఈ పండును పండించడానికి కూడా ఓ స్టోరీ ఉంది. సుమన్ బాయి అనే మహిళ కొడుకు యూపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అవుతుండగా.. అతనికి ఈ మామిడి పండ్లు కనిపించాయి. అయితే వీటి గురించి సెర్చ్ చేశాడు. ఇవి జపాన్‌కి చెందిన మియాజాకీ మామిడి పండ్లు అని తెలుసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లలో ఇవి ఒకటి. అయితే వీటిని సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాడు. ఇక్కడితే ఆగకుండా తన తల్లితో సాగు చేయించాడు. ఈ క్రమంలో అక్కడి నుంచి మొక్కలను తీసుకొచ్చాడు. ఒక్కో మొక్క ధర రూ.6500 పెట్టి జపాన్ నుంచి తీసుకొచ్చాడు. మొత్తం 10 మొక్కలను తీసుకొచ్చి తల్లితో సాగు చేయించాడు. రెండేళ్ల క్రితం సాగు మొదలుపెట్టగా ఇప్పుడు పంట చేతికి వచ్చింది. మొత్తం ఉన్న పది చెట్లలో ఒక్కో చెట్టుకు 12 కాయాలు కాశాయి. వీటిని వ్యవసాయ ప్రదర్శనలో ఉంచగా.. ఒక్కోక్క పండు రూ.10 వేల చొప్పున అమ్ముడు పోయింది.