Telangana Villages Merged Maharashtra: మహారాష్ట్రలో విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు
Telangana Villages Merged Maharashtra మహారాష్ట్రలో విలీనం కావాలని కోరుకుంటున్నారు. పరిపాలనా సేవలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతుల కోసం వారు ఇబ్బందులు పడుతున్నారు.

Telangana Villages Merged Maharashtra: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు సరిహద్దకు చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆయా గ్రామాల్లోని ప్రజల్లో ఆనందం నెలకొంది. అయితే ఆ గ్రామాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా మహారాష్ట్రలో విలీనం కావాలని కోరుకుంటున్నారు. పరిపాలనా సేవలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతుల కోసం వారు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యకు పరిష్కారం దొరికే సూచనలు కనిపించడంతో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో బెళగావి వంటి ఇతర సరిహద్దు ప్రాాంతాలపై కూడా చర్యలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ 14 గ్రామాలు చంద్రపూర్ జిల్లాలోని రాజూరా, జివతి తాలూకాకు చెందినవి. సీఎంల సూచనలతో త్వరలోనే ఈ 14 గ్రామాలు మహారాష్ట్రలో అధికారిక విలీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.