Hacaritama Airport : చెట్ల కింద విమానాల కోసం వెయిట్ చేసే ప్రయాణీకులు.. ఇంతకీ ఎక్కడ ఆ విమానాశ్రయం .. ఏంటా కథ

Hacaritama Airport :
ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందామా? అవును మీరు బస్ ల కోసం, ఆటోల కోసం ఓ తెగ క్యూలో నిల్చొని వెయిట్ చేసి విసిగిపోయి ఉంటారు. యే మాకు కార్లు ఉన్నాయి లే మాకు ఆ అవసరం ఏంటి అంటే చూసి అయితే ఉంటారు కదా. కానీ విమానం కోసం ఎదురుచూసే వారిని చూశారా? అది కూడా కామన్ కదా అంటారా? కానీ చెట్ల కింద కూర్చొని వెయిట్ చేసే వారిని చూశారా? నో నో ఛాన్సే లేదు కదా. అయినా విమానాశ్రమంలో వెయిట్ చేస్తారు కానీ చెట్ల కింద ఎవరైనా విమానం కోసం వెయిట్ చేస్తారా నీ వెర్రి కాకపోతే అంటే మీరు పప్పులో కాలు వేసినట్టే బాస్.. సో ఓ సారి ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అవ్వండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది.
ఏ విమానాశ్రయానికి వెళ్లినా సరే భలే అనిపిస్తుంది. కొన్ని అయితే అదిరిపోయే కట్టడంతో కళ్లు చెదిరేలా ఉంటాయి. ఎన్ని గంటలు అయినా సరే సులభంగా వెయిట్ చేస్తుంటారు. కానీ చెట్ల కింద కూర్చొని వెయిట్ చేసే వారి గురించి విని ఉండరు కదా. ఎందుకంటే అది చాలా చిన్న విమానాశ్రయం. మన దేశంతో సహా అన్ని దేశాలలో జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ప్రపంచవ్యాప్తంగా విమానాలను ఎక్కే ప్రయాణిస్తారు.
అయితే ఇప్పటికీ కూడా విమానాశ్రయం పేరు వినగానే సామాన్యుడు విలాసవంతమైన అనుభూతిని పొందుతారు కదా. ఇక్కడ చెక్ ఇన్ చేసిన తర్వాత ఉన్నత స్థాయి సౌకర్యాలను పొందుతారు. ఆ వ్యక్తికి వేచి ఉండటం ఈజీ అవుతుంది. కానీ ఈ రోజు మనం ప్రపంచంలోని సాధారణ విమానాశ్రయాల కంటే పూర్తిగా భిన్నమైన విమానాశ్రయం గురించి తెలుసుకుందాం.
పూర్తిగా భిన్నమైన విమానాశ్రయం
మిర్రర్ నివేదిక ప్రకారం, కొలంబియాలోని అగ్వాచికా అనే ప్రదేశంలో హుకారిటైమా విమానాశ్రయం ఉంది. ఇది చిన్న స్థలంలో నిర్మించారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ విమానాశ్రయంలో వెయిట్ చేయడానికి కేవలం రెండే ప్రాంతాలు ఉంటాయి. ఒకటి మీరు ఇక్కడికి చేరుకున్నప్పుడు ఉంటుంది. మరొకటి మీ సామాను తనిఖీ చేసేటప్పుడు ఓ ప్లేస్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇక్కడ లగేజీని తనిఖీ చేయడానికి స్కానర్ లేదు. బదులుగా దానిని మాన్యువల్‌గా తనిఖీ చేస్తుంటారు. నిజానికి ఇక్కడ స్కానర్ యంత్రానికి స్థలం కూడా లేదు. విమానాశ్రయానికి వచ్చిన వారు ఎండలో ఉండాల్సిందే. వర్షం వచ్చిన సరే అంతే సంగతులు.
మామిడి చెట్టు కింద వేచి ఉండే ప్రాంతం
సమాచారం ప్రకారం, ఇక్కడ వేచి ఉండటానికి విలాసవంతమైన వెయిటింగ్ రూమ్ లేదు. బదులుగా, ఇక్కడ ప్రజలు మామిడి చెట్టు కింద నిర్మించిన బెంచీపై వెయిట్ చేస్తుంటారట. పురుషులు, స్త్రీలకు ఒకే దగ్గర వేచి ఉండాల్సిందే. ఇక్కడ కేవలం 48 మంది ప్రయాణికులు మాత్రమే ఉండవచ్చు. అందుకే చాలా నీట్ గా ఉంటుంది. ఇక్కడ విమానాలు చిన్నవిగా ఉంటాయి. కానీ సీట్లు చాలా సౌకర్యంగా ఉంటాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.