Google pixle: 16జీబీ ర్యామ్ గూగుల్ ఫోన్‌పై రూ.17,000 తగ్గింపు..!
google pixle: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే ది బెస్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఓ స్పెషల్ ఆఫర్ లో అలాంటి ఫోన్ ను తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు.

google pixle: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే ది బెస్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఓ స్పెషల్ ఆఫర్ లో అలాంటి ఫోన్ ను తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. Google పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అతి పెద్ద డిస్ప్లేతో వస్తుంది. 8.03 అంగుళాల పెద్ద ఫోల్డబుల్ OLED డిస్ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. మంచి పిక్చర్ అనుభవాన్ని పొందాలనుకునే వారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీని కారణంగా ఫోన్ స్క్రీన్ చాలా స్మూత్ గా ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు, స్క్రీన్ స్క్రోల్ చేసేటప్పుడు స్లో అవ్వకుండా వేగవంతమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఈ ఫోన్లో గూగుల్ టెన్సర్ G4 చిప్సెట్ అందించారు. ఇది చాలా శక్తివంతమైన, వేగవంతమైన ప్రాసెసర్. 3.1 GHz క్లాక్ స్పీడ్ ను కలిగి ఉంటుంది. దీని ద్వారా వీడియో ఎడిట్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, మరి ఏ ఇతర పనిచేయాలన్న ఈ ప్రాసెసర్ తో వేగంగా చేసుకోవచ్చు. అందులోనూ ఈ ఫోన్ 16GB రామ్, 256GB స్టోరేజ్ ను కలిగి ఉండటం వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వడం జరగదు. మీరు ఎలాంటి స్పీడ్ లో వాడాలి అనుకున్నా అంతకంటే ఎక్కువ పనితీరును అందిస్తుంది. స్టోరేజ్ ఎక్కువగా ఉండడంతో ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు.. అలాగే ఎన్ని ఫోటోలైన దాచుకోవచ్చు.
ఇక ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ V14తో కలిగిన ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ వి 15 కి కూడా అప్డేట్ చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఏ ఫోన్ కొనాలన్నా కస్టమర్లు ముందుగా కెమెరాను చూస్తారు. ఇప్పుడు ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు ఉన్నాయి. 48MP మెయిన్ కెమెరా, 10.8MP అల్ట్రా వైల్డ్ లెన్స్, 10.5MP టెలిఫోటో లెన్స్ తో ఇది అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో రెండు 10MP కెమెరాలను కలిగి ఉంది. వీటితో సెల్ఫీ వీడియోలు సెల్ఫీ ఫోటోలు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మీరు ఊహించని ఫీచర్లు ఉన్నాయి. నైట్ సైట్, 4 కె వీడియో రికార్డింగ్, మ్యాజిక్ ఎరేజర్, AI ఫీచర్లు వంటివి ఉన్నాయి.
ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర, ఆఫర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 16GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియాంట్ భారతదేశంలో రూ.1,72,999 ధరతో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు దీనిపై ఆఫర్లు లభిస్తున్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 17,000 భారీ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా ఫోన్ పే యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా 1 శాతం డిస్కౌంట్ (2,000 వరకు) లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అంతేకాకుండా ఊహించని ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. దీని ద్వారా ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, క్రోమాలో దీనిని కొనుక్కోవచ్చు.