Kia Cars: పెరగనున్న కియా కార్లు ధరలు.. ఎప్పటినుంచంటే?
Kia Cars: చాలా మంది కార్లు కొంటుంటారు. నిజానికి మధ్య తరగతి ప్రజలు కార్లు కొనాలను ఎన్నో కలలు కంటారు. అయితే మార్కెట్‌లో ఎన్నో కంపెనీల కార్లు ఉన్నాయి.

Kia Cars: చాలా మంది కార్లు కొంటుంటారు. నిజానికి మధ్య తరగతి ప్రజలు కార్లు కొనాలను ఎన్నో కలలు కంటారు. అయితే మార్కెట్‌లో ఎన్నో కంపెనీల కార్లు ఉన్నాయి. చాలా మంది ఎక్కువగా కియా కంపెనీ కార్లను కొంటుంటారు. ఈ కార్లు మంచి ఫీచర్లతో ఉండటంతో చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే కియా కంపెనీ కార్ల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఈ ధరల పెంపు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అన్ని కార్ల మెడల్‌పై కూడా ఈ ధరలు పెంపు ఉంటుందని వెల్లడించింది.
ప్రస్తుతం అన్నింటి ధరలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ముడి సరుకుల ధరలు పెరగడం, సప్లై చైన్ వ్యయాలు పెరగడం వంటి కారణాల వల్ల కియా కార్లు ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఇండియాలో కియా కంపెనీవి సోనెట్, కార్నివాల్, కారెన్స్, ఈవీ9, సెల్టోస్, సైరోస్, ఈవీ6 వంటి మోడళ్లను అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ కారు మోడల్‌పై ధరలు పెంచనున్నారో వాటి విషయాలను త్వరలోనే కంపెనీ ప్రకటించనుంది. అయితే ఎవరైనా కియా కార్లు కొనుగోలు చేయాలంటే మాత్రం ఏప్రిల్ 1వ తేదీకి ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్.
కియా కంపెనీ కార్లు గత నెలలో 23.8 శాతం వార్షిక వృద్ధిని సాధించినట్లు కియా ఇండియా ఇటీవల తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో 20,200 యూనిట్లు కియా కంపెనీ విక్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 25,026 యూనిట్లను కంపెనీ విక్రయించింది. దేశంలో ఇతర కార్ల కంపెనీలు ధరలు పెంచాయి. ఈ క్రమంలోనే కియా కార్లు ధరలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులకు నాణ్యమైన కార్లతో పాటు మంచి మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. టెక్నాలజీ బట్టి కొత్త కొత్త మోడళ్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది.