Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!

Motorola: ప్రముఖ టెక్ బ్రాండ్ మోటో అదిరిపోయే ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసి మంచి గుర్తింపు అందుకుంటుంది. ఇందులో భాగంగానే గత ఏడాది మోటో g45 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం 10000 రూపాయల ధరతో అందుబాటులోకి వచ్చింది. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్ఏ హెచ్ బ్యాటరీని ఇది కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఫోను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో ఈ ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో 4జిబి ర్యామ్, 128gb స్టోరేజ్ ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది.
అలాగే 8 జిబి రామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12, 999 గా ఉంది. ఇందులో ఫ్లిప్కార్ట్ 8gb ram వేరియంట్ పై 1000 రూపాయల డిస్కౌంట్ అందించింది. దీంతో ఈ ఫోన్ రూ.11,999 ధరకే లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై ఐదు శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఇది లభిస్తుంది. అంతేకాకుండా కాకుండా భారీ ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ వర్తిస్తే రూ.10000 కంటే తక్కువ ధరకే 8gb ram వేరియంట్ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మెజంట కలర్లలో అందుబాటులో ఉంది.
Moto g 45 specifications
మోటో జి 45 మొబైల్ 6.5 అంగుళాల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 6s gen 3 చిప్సెట్ ప్రాసెసర్ తో వచ్చింది. ఆండ్రాయిడ్ 14 ఆదరిత os పై పని చేస్తుంది. అలాగే ఇది డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. అందులో బ్యాక్ సైడ్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ కెమెరా అమర్చారు. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16mp ఫ్రంట్ కెమెరా అందించారు. ఫోన్ కు శక్తినివ్వడానికి 5000 mah బ్యాటరీ ఉంది. దీనికి 20 వాట్స్ వైర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు.
ఇక వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్ను కలిగి ఉంది. అదే సమయంలో ఫోన్ సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేసు అన్లాక్ ఫీచర్లను అందించారు. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోసం డాల్బీ అట్మస్ సపోర్ట్ తో స్టీరియా స్పీకర్లను అమర్చారు. ఈ ఫోన్ కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో 5G, 4G, బ్లూటూత్ 5.1, వైఫై, యుఎస్బిసి చార్జింగ్ పోర్ట్ ను అందించారు.
-
Motorola: రూ.6999 కే 50MP కెమెరా ప్రీమియం లుక్ ఫోన్..!
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !
-
Bikes: బెస్ట్ మైలేజ్ బైక్స్.. ఒకసారి ట్యాంక్ నింపితే 10సార్లు తిరొగొచ్చు!
-
Iphone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. వదిలారో మళ్లీరాదు!
-
Google pixle: 16జీబీ ర్యామ్ గూగుల్ ఫోన్‌పై రూ.17,000 తగ్గింపు..!
-
Lenovo: ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ ల్యాపీ.. 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉంటే చాలు