Tecno Pova Curve 5G : రూ.16,999కే కర్వ్డ్ డిస్ప్లే, 16GB ర్యామ్.. ఈ చౌక 5G ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు!

Tecno Pova Curve 5G : రూ.20,000 లోపు ధరలో కర్వ్డ్ డిస్ప్లే ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటుున్నారా.. అదీగాక, ఆ ఫోన్లో ఎక్కువ ర్యామ్ ఉండాలి, ఫీచర్లు కూడా పవర్‌ఫుల్‌గా ఉండాలని భావిస్తున్నారా.. అలాంటి వారికోసం టెక్నో పోవా ఒక అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు, 16GB వరకు ర్యామ్, పవర్ఫుల్ బ్యాటరీ, ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఆ ఫోన్ పేరు టెక్నో పోవా కర్వ్ 5G. ఈ ఫోన్ ధర ఎంత? ఎక్కడ కొనాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ అద్భుతమైన కర్వ్డ్ డిస్ప్లే 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఈ ఫోన్ గ్రీన్ బ్లాక్, మ్యాజిక్ సిల్వర్, నియాన్ సియాన్ అనే మూడు ఎట్రాక్టివ్ కలర్లలో అందుబాటులో ఉంది. ఈ ధర రేంజులో టెక్నో పోవా కర్వ్ 5G ఫోన్ మోటరోలా G85 5G, వివో T4x 5G, వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G వంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీనిస్తుంది. ఈ మూడు ఫోన్లు కూడా రూ.20,000 లోపే లభిస్తాయి.
Read Also:Virat Kohli : ‘కోహ్లీతో నా కూతురికి పెళ్లి చేస్తా’: స్టార్ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ ఫోన్లో ఈ ఫోన్లో 6.78-అంగుళాల ఫుల్ HD+ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది, అంటే ఎండలో కూడా డిస్ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 5G ఫోన్ MediaTek డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది రోజువారీ పనులకు, గేమింగ్‌కు కూడా చక్కగా సరిపోతుంది. ఫోన్‌కు పవర్‌ను అందించడానికి, ఇందులో భారీ 5500mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 45 నిమిషాల్లో 0 నుండి 100% వరకు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది చాలా వేగంగా ఉంటుంది. వెనుకవైపు 64MP సోనీ IMX682 డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. దీంతో అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరాను అమర్చారు. 8GB ర్యామ్ వేరియంట్లో, 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో మొత్తం 16GB ర్యామ్ వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్కువ యాప్‌లు ఒకేసారి రన్ చేసినా ఫోన్ స్లో అవ్వదు.
Read Also:Jio : కస్టమర్లకు షాక్.. నిలిచిపోయిన జియో సేవలు.. మీకు ప్రాబ్లమ్ వచ్చిందా ?
రూ.20,000 లోపు కర్వ్డ్ డిస్ప్లే, ఎక్కువ ర్యామ్, మంచి ప్రాసెసర్, పెద్ద బ్యాటరీని కోరుకునే వారికి టెక్నో పోవా కర్వ్ 5G ఒక అద్భుతమైన ఆప్షన్. ఈ ఫీచర్లతో ఈ ధరలో ఫోన్ దొరకడం చాలా అరుదు. కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వాళ్లు ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి. దగ్గర్లోని స్టోర్‌లో లేదా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.