Phone Security : పిన్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్.. మీ ఫోన్‌కు ఏది ఎక్కువ సేఫ్?

Phone Security : ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన డాక్యుమెంట్ల నుంచి బ్యాంకింగ్ వివరాల వరకు… మొబైల్ ఫోన్లలో చాలా వ్యక్తిగత విషయాలు సేవ్ అయి ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ సెక్యూరిటీని బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫోన్ సెక్యూరిటీ కోసం కొందరు ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఉపయోగిస్తే, మరికొందరు పిన్‌కోడ్ వాడతారు. అయితే, ఈ మూడు ఆప్షన్లలో ఏది అత్యంత పటిష్టమైన భద్రతను అందిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి చాలా మంది ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఉపయోగిస్తారు. ఎందుకంటే సెన్సార్ వల్ల ఫోన్ త్వరగా అన్‌లాక్ అవుతుంది. కానీ పటిష్టమైన భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అంత మంచి ఆప్షన్ కాదని నిపుణులు అంటున్నారు. ప్రతి వేలిముద్ర దేనికదే ప్రత్యేకమైనదే అయినప్పటికీ మీరు నిద్రిస్తున్నప్పుడు మీ వేలిని సెన్సార్‌పై ఉంచి ఎవరైనా ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతారు.
ఫేస్ అన్‌లాక్
ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) టెక్నిక్‌ను కూడా మోసం చేయవచ్చు. 2D ఫేషియల్ రికగ్నిషన్ సెన్సార్లను సులభంగా మోసం చేయవచ్చు. కానీ 3D స్కానింగ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో (ఐఫోన్లు వంటివి) ఈ రకమైన ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంటే, మీ ఫోన్లో 2D ఫేస్ అన్‌లాక్ ఉంటే మీ ఫోటోను చూపించి కూడా అన్‌లాక్ చేసే అవకాశం ఉంది.
పిన్ కోడ్
ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్‌తో పాటు కొందరు పిన్ కోడ్‌ను కూడా ఉపయోగిస్తారు. ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్‌లతో పోలిస్తే పిన్‌కోడ్ ఉపయోగించడం ఎక్కువ సురక్షితం. దీనికి కారణం ఏమిటంటే పిన్‌కోడ్‌ను వేలిముద్రను లేదా ముఖాన్ని దొంగిలించి మోసం చేయలేరు.
Read Also:How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?
కొంచెం కాంప్లెక్స్ (సంక్లిష్టమైన) పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తే ఫోన్ సెక్యూరిటీని స్ట్రాంగ్ గా ఉంచుకోవచ్చు. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, సింబల్స్, నంబర్లు… ఈ అన్ని అంశాలు ఒక స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లో ఉండాలి. అప్పుడు పాస్‌వర్డ్‌ను సులభంగా ఛేదించడం ఎవరికీ అంత సులభం కాదు. ఉదాహరణకు: MyPhoNe@123! లాంటి పాస్వర్డ్ చాలా సురక్షితంగా ఉంటుంది.