Spouse Secret apps : మీకు తెలియకుండా మీ భాగస్వామి ఏవైనా యాప్స్ ఉపయోగిస్తున్నారా? ఇలా తెలుసుకోండి.

Spouse Secret apps :
స్మార్ట్‌ఫోన్‌లు పనిని సులభతరం చేయగలవు కానీ ఇబ్బందులను కూడా కలిగిస్తాయి. ప్రతిరోజూ స్మార్ట్‌ఫోన్‌లో ఏదో ఒక కొత్త ఫీచర్ యాడ్ అవుతుంది. ఇక కొన్ని హైడ్ లో పెట్టడానికి కూడా వీలు ఉంటుంది. ఇలాంటి లక్షణాలను ఉపయోగించి చాలా మంది తెలివైనవారు గా మారుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో వారి ముందు చాలా విషయాలు దాయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. మరీ ముఖ్యంగా భాగస్వాముల వద్ద చాలా విషయాలు దాచడానికి అవసరం అవుతున్నాయి. కానీ ఇలాంటి ఫీచర్ల వల్ల భాగస్వాములను మోసం కూడా చేస్తున్నారు కొందరు.
అయితే స్మార్ట్‌ఫోన్‌లో ఒక ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా మీరు మీకు ఇష్టమైన కొన్ని యాప్‌లను ఫోన్‌లోనే దాచవచ్చు. మీరు ఆ యాప్‌ను ఉపయోగిస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు?అయితే మీకు తెలియకుండానే మీ భాగస్వామి తన ఫోన్ నుంచి కొన్ని యాప్‌లను దాచిపెట్టారని మీకు అనిపిస్తుందా? మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చాలా సులభం. కొన్ని సులభమైన స్టెప్స్ సహాయంతో, మీ భాగస్వామి ఫోన్‌లో దాచిన యాప్‌ల గురించి మీరు తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో దాచిన యాప్‌ల గురించి ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎవరైనా తమ సొంత ఫోన్‌లో యాప్‌లను ఎందుకు దాచుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. కొన్నిసార్లు కొంతమంది తమ భాగస్వాములను మోసం చేయడానికి WhatsApp, Instagram వంటి యాప్‌లకు యాక్సెస్ ఇస్తారు. కానీ మరికొన్ని చాటింగ్ యాప్‌లను దాచిపెడతారు. దీనివల్ల ఇతరులు తమ ఫోన్‌లో ఏ రహస్య విషయాలు ఉన్నాయో త్వరగా కనుక్కోలేరు.
ఎలా తెలుసుకోవాలంటే?
మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో హైడ్ చేసిన యాప్‌లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలనుకుంటే, దీని కోసం మీరు ముందుగా ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేయండి . ఇక్కడి సెర్చ్ దగ్గరకు వెళ్ళండి. ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్న యాప్ పేరును సెర్చ్ చేయండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా సెర్చ్ చేశారు అనుకుందాం. అయితే ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి బదులుగా దాన్ని ఓపెన్ చేయమని వస్తుంది కదా. అంటే అది ఆల్రెడీ మీ ఫోన్ లో ఉన్నట్టు. సో ఇలా వారి ఫోన్ లో ఆ యాప్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. దీన్ని ఉపయోగించి మీరు WhatsApp, Instagram, Tinder వంటి అన్ని డేటింగ్, చాటింగ్ యాప్‌లను సెర్చ్ చేయవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Relationship : ముందు ప్రేమ, తర్వాత వివాహం, ఆ తర్వాత పశ్చాత్తాపం.. బట్ ఎందుకు?
-
Love: ప్రేమ కోసం మీరు మారుతున్నారా?
-
Relationship: మీతో వారు అసలు మాట్లాడటం లేదా? సైలెంట్ మెయింటెన్ చేస్తున్నారా? తప్పు నీదే
-
Relationship: ప్రేమ ఉన్న సరే మీరు విడిపోతారు? ఎందుకంటే?
-
Relationship: ఈ చిన్న విషయాలను పెద్దగా చేస్తున్నారా? అయితే బాండింగ్ బ్రేక్ తప్పదు
-
Relationship : మీ మాజీకి రెండవ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా?