Facts: పుట్టకుండా గుడ్డులోనే ఉండి మాటలాడే జీవి ఏంటో తెలుసా?

Facts: ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్నాయి. అయితే ఒక్కో జంతువు కాలం ఒక్కోలా ఉంటుంది. అయితే ఒక్కో దాని పుట్టుక ఒక్కోలా ఉంటుంది. కొన్ని జంతువుల పుట్టుక కాస్త డిఫరెంట్ ఉంటుంది. అయితే జంతువులు కొన్ని పుట్టాలంటే తప్పకుండా గుడ్లు పెడతాయి. ఉదాహరణకు కోళ్లు అయితే గుడ్లు పెడతాయి. వీటిని కొన్ని రోజుల పాటు కోడి తల్లి దగ్గర పొదిగిస్తే కోడి పిల్ల వస్తుంది. ఇవి ఆ గుడ్డు పెంకును పగలగొట్టి మరి బయటకు వస్తాయి. దీనికి కనీసం 21 రోజుల సమయం పడుతుంది. అయితే కోడి పిల్లల గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అవి పుట్టకముందే గుడ్డు లోపల కూడా మాట్లాడుతాయి. నమ్మడానికి కాస్త వింతగా ఉన్నా కూడా ఇదే నిజం. పెంకు లోపల ఉన్న కోడి గుడ్లు ఇతర కోళ్లతో మాట్లాడుకుంటాయి. వీటితో పాటు తాబేళ్లు పిల్లలు కూడా గుడ్లలో ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. ఈ అద్భుతమైన విషయాన్ని మొదట గాబ్రియేల్ జార్జివిచ్-కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రపంచానికి తెలిపారు. తాబేలు గుడ్ల దగ్గర ఒక ప్రత్యేకమైన పరికరం ఉంచగా వాటి నుంచి వింత శబ్దాలు, కంపనాలు వస్తున్నాయని కనుగొన్నారు.
తాబేలు పిల్లలు తమ గుడ్ల లోపల నుండి చేసే శబ్దాలు మిగిలిన పిల్లలకు ఒక సంకేతంగా ఉంటాయి. దీనివల్ల మిగతా గుడ్లు కూడా బయటకు హ్యాపీగా వస్తాయి. అయితే ఒక తాబేలు పిల్ల దాని గుడ్డు నుండి పొదిగి ఒంటరిగా సముద్రంలోకి వెళితే, అది డేగ, ఆకాశంలో ఎగురుతున్న కాకికి లేదా ఒడ్డున వేచి ఉన్న నక్క లేదా పీతకు సులభమైన ఆహారంగా మారుతుంది. మరోవైపు, వందలాది పిల్లలు కలిసి బయటకు వచ్చి సముద్రం వైపు పరుగెత్తడం ప్రారంభిస్తే, వేటాడే జంతువులు గందరగోళానికి గురవుతాయి. దేనిని పట్టుకోవాలో, దేనిని వదిలివేయాలో తెలియక వారు అయోమయంలో ఉన్నప్పుడు చాలా పిల్లలు సురక్షితంగా నీటిలోకి ప్రవేశిస్తాయి. ఈ లక్షణం తాబేళ్లలోనే కాదు, కొన్ని జాతుల పక్షులు, మొసళ్లు వంటి సరీసృపాలలో కూడా ఉన్నట్లు గుర్తించారు. మిగతా వాటితో పోలిస్తే తాబేళ్లలో ఈ సమన్వయ సంభాషణ చాలా స్పష్టంగా ఉంటుంది. కోళ్లు కూడా ఇలానే మాట్లాడి, తమని తాము రక్షించుకుంటాయట. దీనివల్ల వాటికి హాని కూడా కలగదు. ఒకవేళ కలిగినా కూడా అవి వాటిని రక్షించుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్ని విధాలుగా కూడా జంతువులు పిల్లలు రక్షణగా ఉంటాయి. ఈ కారణాల వల్లే చాలా వరకు జంతువుల పిల్లలు గుడ్లలోనే మాట్లాడతాయి.
Also read: Naga Chaitanya : శోభిత వల్లే మారిన నాగ చైతన్య..ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ
-
Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
-
Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్‌కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే
-
MS Dhoni and Sandeep Reddy Vanga : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్న ధోని… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?