Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్‌కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే

Viral Video : పెళ్లంటే నూరేళ్ల పండుగ. అందుకే ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. పెళ్లికి ఎక్కడెక్కడి చుట్టాలను అందరినీ పిలుచుకుని చేసుకుంటారు. పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సవ్యంగా జరగాలని అనుకుంటారు.కానీ కొన్నిసార్లు ఊహించని అతిథులు వచ్చి మొత్తం వాతావరణాన్ని పాడు చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక మనిషి కాదు.. ఏకంగా ఒక ఎద్దు పెళ్లి పందిట్లోకి దూసుకొచ్చి చేసిన రచ్చ రచ్చ చేసింది.
మ్యూజిక్ మనిషిని పూర్తిగా మార్చేస్తుందని అంటారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మ్యూజిక్ వల్ల ఒక ఎద్దు ఏకంగా పిచ్చెక్కినట్లు ప్రవర్తించింది. పెళ్లి పందిట్లోకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. అక్కడ డ్యాన్స్ చేస్తున్న వారికి భయం అంటే ఏంటో పరిచయం చేస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కటే అంటున్నారు. బహుశా ఎద్దుకు మ్యూజిక్ నచ్చలేదనుకుంటా… అందుకే అంత కోపంగా ఉందంటున్నారు.
Read Also:Obesity in India : పిల్లలను కూడా వదలని ఊబకాయం.. వచ్చే 25 ఏళ్లలో అందరికీ పొట్టలుంటాయట
@gharkekalesh pic.twitter.com/uX36APsbZS
— Arhant Shelby (@Arhantt_pvt) May 13, 2025
వీడియోలో ఒక పెళ్లిలో మ్యూజిక్ బ్యాండ్ స్టేజ్‌పై పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఫుల్ సౌండ్‌లో పాటలు వినిపిస్తుండగా అందరూ ఆ క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇంతలో కెమెరా ఫ్రేమ్‌లోకి ఒక ఎద్దు ఎంట్రీ ఇచ్చి విధ్వంసం సృష్టించడం మొదలు పెడుతుంది. దాని చర్యలు చూస్తుంటే ఆ సింగర్ పెర్ఫార్మెన్స్ అంటే దానికి చాలా అలర్జీ ఉన్నట్లుంది. ఆ తర్వాత ఎద్దు తన కాళ్లను గాల్లోకి విసిరి స్టేజ్‌పై ఒక విధమైన తుఫానును సృష్టించింది. గిటార్, డ్రమ్స్, స్పీకర్లు అన్నీ ఎగిరి పడుతూ కనిపించాయి.
ఈ వీడియోను Xలో @gharkekalesh అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి వేల మంది దీనిని చూసి కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇది ఎలాంటి గొడవ భయ్యా… ఇది ఏకంగా విధ్వంసమే సృష్టించింది’ అని కామెంట్ చేశాడు. మరొకరు ‘అరే పాట మార్చండి భయ్యా లేదంటే ఇది మీ జీవితాన్ని మారుస్తుంది’ అని రాశారు. ఇంకా చాలా మంది దీనిపై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Dark Spots : ఈ 5 ఇంటి చిట్కాలు ట్రై చేయండి..వేసవిలో నల్ల మచ్చలకు చెక్ పెట్టండి
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్