Mega 157: సంక్రాంతికి రఫ్ఫాడించేస్తాం అంటూ.. అనిల్-చిరంజీవి మూవీలో స్టార్ హీరయిన్

Mega 157: సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి మూవీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా అన్నిటిని తెలియజేస్తూ మూవీ మేకర్స్ వీడియో రిలీజ్ చేశారు. కానీ మూవీ హీరోయిన్ ఎవరనే విషయాన్ని అయితే వెల్లడించలేదు. ఇప్పుడు మూవీ టీం ఈ విషయాన్ని తెలిపింది. చిరంజీవి 157 మూవీకి నయనతార హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు అనిల్ రావిపూడి కొత్తగా తెలిపారు. మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటి నుంచే మూవీ ప్రమోషన్ ను స్టార్ట్ చేశారు. సరికొత్తగా వీడియోతో హీరోయిన్ ను పరిచయం చేశారు.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
నయనతార, చిరంజీవి సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లో నటించారు. మళ్లీ ఈ కాంబో రానుంది. ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టడం పక్కా అనిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఈసారి మళ్లీ హ్యాట్రిక్ కొట్టడానికే నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి మూవీ ప్రమోషన్ అయితే అదుర్స్. హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అని ఆమెను టీమ్‌లో ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇలా ఎంట్రీ వీడియోనే ఇలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
అనిల్ రావిపూడి, చిరంజీవి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి సాహు గారపాటి, చిరంజీవి తనయ సుస్మిత నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఇద్దరు కథానాయికలు కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరిని కూడా సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. అనిల్ రావిపూడి ప్రతీ ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తారు. ప్రతీ సారి హిట్ కొడుతుంటారు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడికి సినిమా ఫ్లాప్ అయిన టాక్ అయితే లేదు. తీసిన అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అన్ని మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఈ సంక్రాంతికి కూడా చిరంజీవికి హిట్ పడటం ఖాయం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
దీంతో పాటు చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎన్ని నెలలు అవుతున్న కూడా ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే విషయంపై మేకర్స్ స్పందిస్తేనే తెలుస్తుంది. అలాగే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
-
Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
-
Ram Charan: రామ్ చరణ్ పై డాక్యుమెంటరీ తియ్యబోతున్న నెట్ ఫ్లిక్స్..మరో అరుదైన గౌరవం!
-
Mega 157: అనిల్ రావిపూడి చిరంజీవి మూవీ నుంచి వీడియో రిలీజ్ వైరల్
-
Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు…
-
Ram Charan : రామ్ చరణ్ డ్యాన్స్ తగ్గుతుందా..? దానికి కారణం ఇదేనా..?
-
Vishwambhara: విశ్వంభరలో సందడి చేయనున్న మెగా డాటర్.. మాములుగా ఉండదుగా.. మెగా ఫ్యాన్స్‌కి పండగే