Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు…

Chiranjeevi and Anil Ravipudi :
సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్లకి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండడమే కాకుండా మార్కెట్ పరంగా కూడా వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. అందుకే దర్శకులందరూ స్టార్ హీరోలతో సినిమాలను చేసి వాళ్ళు కూడా స్టార్ డైరెక్టర్లుగా మారిపోవాలనే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రాయపూడి(Anil Ravipudi)… ఆయనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడంలో ఆయన ఎనలేని ముద్రను వేసుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి తన స్టామినా ఏంటో చూపించాడు.
Also Read: Salaar 2 and Kalki 2 : సలార్ 2, కల్కి 2 దర్శకులు ప్రభాస్ ను నెక్స్ట్ లెవల్లో చూపించబోతున్నారా..?
ఇక వీటితో పాటు గా ఒక భారీ విజయాన్ని అందుకోవానే దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయనలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ ని కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన సినిమాలు అన్ని సక్సెస్ ఫుల్ గా నిలిచి ముందుకు సాగడమే కాకుండా ఆయనకంటూ ఒక ఎనలేని గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి…
మరి ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం విశేషం. ఇక అనిల్ ఈ సినిమాలో సాంగ్స్ కి పెద్దగా స్కోప్ ఉండే విధంగా అయితే చూడడం లేదట. ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపేయాలని చూస్తున్నాడట…
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆయన పాత్ర ఏంటి అనే విషయం ఇంకా బయటికి తెలియజేయడం లేదు కానీ మొత్తానికైతే అనిల్ రావిపూడి విజయ్ తో సన్నాహాలు జరిపి మరి ఈ సినిమా కోసం తనని ఒప్పించినట్టుగా తెలుస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చిందంటే ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు. అందుకోసమే తను ఒక క్యామియో రోల్ లో పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఏంటి అనేది తెలియదు కానీ సినిమాలో తను కూడా ఒక భాగం కాబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో అటు అనిల్ రావిపూడి ఇటు చిరంజీవి ఎలాంటి విజయలు సాధిస్తారు తద్వారా వాళ్లకు ఎలాంటి గుర్తింపు లభిస్తుంది అనేది…
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Mega 157: అనిల్ రావిపూడి చిరంజీవి మూవీ నుంచి వీడియో రిలీజ్ వైరల్
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?