Mega 157: అనిల్ రావిపూడి చిరంజీవి మూవీ నుంచి వీడియో రిలీజ్ వైరల్
Mega 157 మెగాస్టార్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల పేర్లు లేదా అందులోని ఫేమస్ డైలాగ్‌లు చెబుతూ సినిమాలో వారు ఏం వర్క్ చేయనున్నారో పరిచయం చేసుకున్నారు.

Mega 157: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని.. సెకండ్ ఇన్నింగ్స్‌లో హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా హిట్ కాలేదు. వరుస సినిమా బాక్సాఫీస్‌ను ఆడలేదు. అయితే ఈసారి పక్కాగా హిట్ కొట్టాలని.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకి ఇంకా ఎలాంటి పేరు కూడా పెట్టలేదు. మెగా 157 పేరుతోనే పిలుస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ మూవీ టీం సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. మూవీలో ఎవరెవరు కో రైటర్లు, నిర్మాతగా ఎవరనే పూర్తి వివరాలతో వీడియోను రిలీజ్ చేసింది. ఇంతకీ ఎవరు ఏం చేస్తున్నారో? వీడియో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మెగాస్టార్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల పేర్లు లేదా అందులోని ఫేమస్ డైలాగ్‌లు చెబుతూ సినిమాలో వారు ఏం వర్క్ చేయనున్నారో పరిచయం చేసుకున్నారు. చిరంజీవి నడుచుకుంటూ వెళ్తుండగా.. మీ కామెడీ టైమింగ్ సూపర్ అని, అందులో చూడాలని ఉందని డైరెక్షన్ టీం చెబుతుంది. ఆ తర్వాత మీకు జెమ్స్‌లా పనిచేస్తామని రైటర్స్ టీం చెబుతోంది. ఇలా ఎవరు ఏం చేస్తారో అన్నింటిని కూడా పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత సుష్మిత కొణిదెల నిర్మాతగా తన పేరును పరిచయం చేసుకుంది. అప్పుడు చిరంజీవి ఆ పేరుని నిలబెట్టు అని చెప్పి వెళ్లిపోతాడు. చివరగా అసలైన వాడు ఏడని చిరంజీవి అనగా.. ఇంతలో అనిల్ రావిపూడి దర్శనం ఇస్తాడు. గ్యాంగ్ లీడర్ పోస్టర్ నుంచి రావడంతో చిరంజీవి తెలుసయ్యా.. నువ్వే కదా దీనికి గ్యాంగ్ లీడర్ అని అంటాడు. అప్పుడు చిరంజీవి సంక్రాంతికి ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి రఫ్పాడిద్దామని అనుకుంటున్నానని చెబుతాడు. ఇలా కొత్తగా మెగా 157 మూవీ టీంని అనిల్ రావిపూడి పరిచయం చేశాడు. ఇదిలా ఉండగా ఉగాది సందర్భంగా పూజను నిర్వహించి సినిమాను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అనిల్ రావిపూడి ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ కొట్టాడు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొట్టింది. దాదాపుగా రూ.300 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో పాటు మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా వెంటనే అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. మరి అనిల్ రావిపూడి చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి హిట్ ఇస్తాడో లేదో చూడాలి.
What better way to introduce our team to the legendary Megastar @KChiruTweets Garu than by paying tribute to his timeless dialogues 😍❤️🔥
Let’s celebrate MEGASTAR in his forte in #Mega157 🥳
SANKRANTHI 2026 – రఫ్ఫాడిద్దాం 😎#ChiruAnil @sahugarapati7… pic.twitter.com/xGhSLaIstr
— Anil Ravipudi (@AnilRavipudi) April 1, 2025