AC : ఏసీ కంప్రెసర్ ను ఎక్కడ ఉంచాలి..తెలుసుకుంటే విద్యుత్ బిల్లు చాలా ఆదా!

AC : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి ఎయిర్ కండీషనర్లను ఉపయోగిస్తుంటారు. అయితే, మార్కెట్‌కు వెళ్లి ఒక మంచి ఏసీని కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో, దానిని సరైన పద్ధతిలో ఫిట్ చేయడం కూడా అంతే ముఖ్యం. చాలామంది వినియోగదారులు ఏసీ ఇండోర్ యూనిట్‌పై మాత్రమే శ్రద్ధ చూపుతారు, కానీ దాని అవుట్‌డోర్ యూనిట్, అంటే కంప్రెసర్‌ను ఎక్కడ , ఎలా అమర్చాలనే దానిపై సరైన అవగాహన ఉండదు. మీ ఎయిర్ కండీషనర్ పనితీరు దాని అవుట్‌డోర్ యూనిట్ ప్లేస్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుందని చాలామందికి తెలియదు. గదిని మంచిగా చల్లబరిచే బాధ్యత కంప్రెసర్‌దే కాబట్టి, కొత్త ఏసీని ఏర్పాటు చేసేటప్పుడు లేదా మీరు ఇల్లు మారిన తర్వాత ఏసీని తిరిగి ఫిట్ చేసేటప్పుడు, కంప్రెసర్‌ను ఉంచే స్థానం సరైనదని ఎంచుకోవడం చాలా అవసరం. ఒకవేళ ఏసీ కంప్రెసర్‌ను తప్పు స్థలంలో ఉంచితే అది అనేక ప్రతికూల ప్రభావాలకు దారితీయవచ్చు.
Read Also:iPhone 17 : ఐఫోన్ 17 ప్రో లీక్డ్ డిజైన్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!
ఏసీ కంప్రెసర్‌ను సరైన స్థలంలో అమర్చకపోవడం వల్ల కలిగే ప్రధాన నష్టం ఏమిటంటే.. ఏసీ కూలింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. దీని అర్థం, మీ గదిని చల్లబరచడానికి ఏసీ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం అనవసరంగా పెరుగుతుంది. విద్యుత్ వినియోగం పెరిగితే మీ నెలవారీ విద్యుత్ బిల్లు కూడా ఊహించని విధంగా పెరిగిపోతుంది. ఇది మీ ఆర్థిక భారం పెంచే ఒక ముఖ్యమైన అంశం. అంతేకాకుండా, మీరు మీ ఏసీని అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశంలో ఉంచితే ముఖ్యంగా 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, కంప్రెసర్ వేడెక్కే ప్రమాదం కూడా ఉంది. కంప్రెసర్ అధికంగా వేడెక్కితే దాని అంతర్గత భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ఏసీ లైఫ్ స్పాన్ తగ్గిస్తుంది.మరమ్మత్తు ఖర్చులను పెంచుతుంది.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
మరి మీ ఏసీ కంప్రెసర్‌ను ఎక్కడ ఉంచాలి? ప్రముఖ ఎయిర్ కండీషనర్ తయారీ సంస్థలైన TCL, Daikin వంటి కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లలో ఈ విషయం గురించి తెలిపాయి. ఏసీ యొక్క అవుట్‌డోర్ యూనిట్‌ను ఎల్లప్పుడూ నేరుగా సూర్యకాంతి పడని ప్రదేశంలో ఉంచాలి. నేరుగా సూర్యరశ్మి తగలడం వల్ల కంప్రెసర్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాని పనితీరు తగ్గుతుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అలాగే, కంప్రెసర్ నుండి వెలువడే వేడి గాలికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేలా చూడాలి. కంప్రెసర్ వెనుక లేదా చుట్టూ గోడలు లేదా ఇతర వస్తువులు ఉంటే, వేడి గాలి బయటకు వెళ్లడానికి ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల కంప్రెసర్ మరింత వేడెక్కుతుంది. దాని సామర్థ్యం తగ్గుతుంది.
-
AC Warranty Types : AC కొంటున్నారా? ఒక్కటి కాదు, ఈ 3 వారంటీలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి !
-
Electricity Bill: కరెంట్ బిల్ తక్కువగా రావాలా.. ఈ ఫ్యాన్‌లు వాడండి
-
AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?
-
Power Bill: వేసవిలో కరెంట్ బిల్ తక్కువగా రావాలా? ఈ చిట్కాలు పాటించండి
-
AC: ఆన్‌లైన్‌లో ఏసీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి