Electricity Bill: కరెంట్ బిల్ తక్కువగా రావాలా.. ఈ ఫ్యాన్‌లు వాడండి
Electricity Bill: బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ ఫ్యాన్‌లను వేసవిలో వాడటం మంచిది. వీటిలో సాధారణ మోటార్‌లో ఉండే బ్రష్ అయితే ఉండదు. ఎలక్ట్రానిక్ కంట్రోలర్ ద్వారా ఈ ఫ్యాన్‌ల మోటార్ పనిచేస్తుంది.

Electricity Bill: వేసవి కాలంలో వేడి వల్ల చాలా మంది ఫ్యాన్‌లు, ఏసీ, కూలర్లను ఎక్కువగా వాడుతుంటారు. వీటిని వాడితే తప్పకుండా కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. అయితే కరెంట్ బిల్ ఎక్కువగా వస్తే కట్టుకునే వారు వేసవిలో ఏసీలు, కూలర్‌లు వాడుతారు. అదే మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఫ్యాన్‌లు వాడుతారు. అయితే వేసవిలో ఫ్యాన్‌లు తీసుకునేటప్పుడు తప్పకుండా అన్ని విషయాలు కూడా చెక్ చేసుకుని తీసుకోవాలి. లేకపోతే ఫ్యాన్‌లు తీసుకున్న కొన్ని రోజులకే సమస్యలు వస్తాయి. ఎప్పుడు తీసుకున్నా కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల పెద్దగా కరెంట్ బిల్ రాదు. అయితే వేసవిలో మధ్యతరగతి ప్రజలు ఫ్యాన్‌లు వాడుతారు. రోజంతా వాడినా కూడా కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే మాత్రం తప్పకుండా వాడాల్సిన ఫ్యాన్‌లు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: Cooking Oil: ఈ నూనెలు వంటల్లో ఉపయోగిస్తున్నారా.. అంతే సంగతులు ఇక
బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ ఫ్యాన్‌లను వేసవిలో వాడటం మంచిది. వీటిలో సాధారణ మోటార్‌లో ఉండే బ్రష్ అయితే ఉండదు. ఎలక్ట్రానిక్ కంట్రోలర్ ద్వారా ఈ ఫ్యాన్‌ల మోటార్ పనిచేస్తుంది. అయితే ఈ ఫ్యాన్‌లు డీసీ మోటార్‌ను ఉపయోగిస్తాయి. వీటిని ఎక్కువగా వాడినా కూడా పెద్దగా కరెంట్ బిల్ రాదు. ఏసీ మోటార్‌తో పనిచేసే ఫ్యాన్లు ఎక్కువగా కరెంట్ బిల్ వస్తాయి. అదే ఈ బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ ఫ్యాన్‌లు అయితే చాలా తక్కువగా కాలుతాయి. ఈ ఫ్యాన్ సగటున 24 నుండి 35 వాట్స్ వరకు మాత్రమే ఖర్చు చేస్తుంది. 50 నుంచి 100 వాట్స్ వరకు నార్మల్ ఫ్యాన్‌లు విద్యుత్‌ను ఖర్చు చేస్తాయి. సాధారణ ఫ్యాన్ కేవలం 10 గంటల వరకు మాత్రమే నడుస్తుంది. వీటితో పోల్చుకుంటే.. BLDC ఫ్యాన్‌లు 25 నుంచి 28 గంటల వరకూ నడుస్తాయి. అలాగే వీటికి పెద్దగా సౌండ్ కూడా రాదు. దాదాపుగా 32 డెసిబెల్స్ వరకు మాత్రమే సౌండ్ చేస్తుంది. అయితే ఈ ఫ్యాన్‌లు ఇన్వర్టర్‌పై కూడా బాగా నడుస్తాయి. అంటే కరెంట్ వెళ్లిపోయిన వెంటనే ఆగిపోవు. కరెంట్ పోయిన తర్వాత కూడా ఎక్కువ సమయం నడుస్తాయి. వీటిలో స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: Financial Problems: ఈ దిశలో బీరువా పెడితే.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
ఈ ఫ్యాన్‌లు ఎక్కువ ఏళ్లు మన్నికగా వస్తాయి. సాధారణ ఫ్యాన్‌లు కేవలం 5 నుంచి 6 సంవత్సరాలు పనిచేస్తాయి. అదే BLDC ఫ్యాన్లు అయితే 7నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేస్తాయి. BLDC ఫ్యాన్స్‌లో ఇలా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. వీటి ధర రూ.3,000 నుంచి ప్రారంభం అవుతుంది. రూ7,000 వరకు కూడా ఉన్నాయి. వీటిని వాడటం వల్ల కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. అలాగే ఇందులోని ఫీచర్ల వల్ల ఇవి ఎక్కువ కాలం మన్నికగా వస్తాయి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
AC : ఏసీ కంప్రెసర్ ను ఎక్కడ ఉంచాలి..తెలుసుకుంటే విద్యుత్ బిల్లు చాలా ఆదా!
-
Anchor Anasuya: ఈ ఫీల్డ్‌లో అయితే మా ఆయన సక్సెస్ కాలేరు.. భర్తపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అనసూయ
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు