Cooking Oil: ఈ నూనెలు వంటల్లో ఉపయోగిస్తున్నారా.. అంతే సంగతులు ఇక
వంటలు చేయడానికి నూనె తప్పకుండా ఉండాలి. అయితే సాధారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వంటల్లో వాడుతారు. మరికొందరు ఆరోగ్యపరంగా ఆలివ్ ఆయిల్, వేరుశెనగ నూనె ఇలా రకరకాలు వాడుతుంటారు.

Cooking Oil: వంటలు చేయడానికి నూనె తప్పకుండా ఉండాలి. అయితే సాధారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వంటల్లో వాడుతారు. మరికొందరు ఆరోగ్యపరంగా ఆలివ్ ఆయిల్, వేరుశెనగ నూనె ఇలా రకరకాలు వాడుతుంటారు. అయితే ప్రస్తుతం నూనెలు అన్ని కూడా కల్తీ అయిపోతున్నాయి. ఎలాంటి నూనెలు వాడినా కూడా ఆరోగ్యానికి మంచివి కావు. అయితే వంటలకు కొన్ని నూనెలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే అసలు వంటలకు ఉపయోగించకూడని ఆ నూనెలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కనోలా నూనె
కొందరు కనోలా నూనెను వంటలకు ఉపయోగిస్తారు. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నూనెను అధిక ఉష్ణోగ్రతల వద్ద హెక్సేన్ వంటి రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. అలాగే ఇందులో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేలా చేస్తాయి. కాబట్టి ఈ ఆయిల్‌ను వాడవద్దు.
సోయాబీన్ నూనె
ఈ నూనె ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి వాపు వస్తుంది. దీన్ని కూడా అధిక ఉష్ణోగ్రతల వద్ద వాడటం వల్ల అనారోగ్యానికి దారితీస్తుంది. అందరి ఆరోగ్యానికి కూడా ఈ సోయాబీన్ నూనె అంత మంచిది కాదు.
మొక్కజొన్న నూనె
మొక్కజొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వీటివల్ల దుర్వాసన, వాపు, అనారోగ్య సమస్యలు వంటివి వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ నూనెతో వంట చేస్తే ఇందులోని ఆల్డిహైడ్‌లు వస్తాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్, లావణ్య.. మెగా ఫ్యామిలీలోకి మరో హీరో!
పత్తి గింజల నూనె
పత్తిని ఎక్కువగా పూజకి ఉపయోగిస్తారు. అయితే ఈ పత్తి గింజల నూనెను కూడా వంటల్లో అసలు ఉపయోగించకూడదు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని శుద్ధి చేసేటప్పుడు ఇందులో విషపూరితమైన గోసిపోల్ వస్తుంది. దీన్ని తొలగించినా కూడా ఇందులో కాస్త ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. దీనివల్ల మానవుల్లో పునరుత్పత్తి వ్యవస్థ, కాలేయ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కుసుమ నూనె
కుసుమ నూనెలో ఎక్కువగా అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలు వచ్చేలా చేస్తాయి. ఈ నూనెలో ఎక్కువగా లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది క్యాన్సర్, డయాబెటిస్, గుండె వంటి సమస్యలు వచ్చేలా చేస్తుంది. కాబట్టి వంటల్లో ఈ నూనెలు అయితే అసలు వాడవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Health Tips: వంటలకు కొబ్బరి, వేరుశెనగ.. రెండింటిలో ఏది బెటర్?
-
CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
-
Mega family: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్, లావణ్య.. మెగా ఫ్యామిలీలోకి మరో హీరో!
-
Financial Problems: ఈ దిశలో బీరువా పెడితే.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
-
Aadhaar card: ఆధార్ కార్డు విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తే.. జైలు శిక్ష తప్పదు
-
Milk to Your Children: నిద్రపోయే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త