Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి
ఉద్యోగంలో చిరాకు రావడం లేదా వర్క్ స్పేస్‌లో కాస్త సమస్యలు ఉంటే కొందరు ఏం ఆలోచించకుండా ఉద్యోగం మానేస్తారు.

Goodbye to Your Job: ఉద్యోగంలో చిరాకు రావడం లేదా వర్క్ స్పేస్‌లో కాస్త సమస్యలు ఉంటే కొందరు ఏం ఆలోచించకుండా ఉద్యోగం మానేస్తారు. దీంతో సమస్యల్లో పడతారు. ఉద్యోగం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ సమస్యలు అయినా ఉండవచ్చు. కానీ ఆర్థిక సమస్యలు మాత్రం అసలు ఉండకూడదు. దీనివల్ల ఎక్కువగా ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. అయితే చాలా మంది కనీస విషయాలు తెలుసుకోకుండా ఉద్యోగాన్ని వదిలేస్తారు. దీనివల్ల ఆ తర్వాత ఇబ్బందులు పడతారు. ఎప్పుడైనా కూడా జాబ్‌కి రిజైన్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొన్ని విషయాలు ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఉద్యోగం మానేసిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఉద్యోగం రిజైన్ చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also:ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది
ఉద్యోగ ఒప్పందాన్ని సరిగ్గా చూడండి
ఉద్యోగానికి రాజీనామా చేసే ముందు జాయిన్ అయినప్పుడు ఉన్న పేపర్‌ను చదవండి. ఎందుకంటే కొందరు ముందుగానే ఒప్పందం రాసుకుని ఉంటారు. మీరు ఆ రూల్స్‌ను పాటించకుండా రిజైన్ చేస్తే మాత్రం తప్పకుండా సమస్యలో ఇరుక్కుంటారు. కంపెనీ తప్పకుండా కొన్ని రూల్స్ పాటిస్తుంది. వాటికి అనుగుణంగానే నడుచుకోవాలి. లేకపోతే మీరు డబ్బులు కట్టవలసి వస్తుంది. కాబట్టి ముందుగానే ఏయే వివరాలు అందులో ఉన్నాయో తెలుసుకున్న తర్వాతే జాబ్‌కి రిజైన్ చేయాలి.
ఆర్థిక సమస్యలు
మీ ఆర్థిక సమస్యలు ఏంటనే విషయాన్ని ముందుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలు ఉంటే మనశ్శాంతి ఉండదు. మీరు సడెన్‌గా ఉద్యోగం మానేసినా కూడా ఎలాంటి సమస్య లేదనిపిస్తే మాత్రం రిజైన్ చేయండి. అదే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయని అనుకుంటే మాత్రం వేరే జాబ్ చూసుకున్న తర్వాత రిజైన్ చేయండి. దీనివల్ల మీకు డబ్బు సమస్యలు రావు. అయితే తర్వాత జాబ్ జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత రిజైన్ చేయండి. పాత జాబ్ మానేసిన ఒక వారం రోజుల్లోగా కొత్త జాబ్ జాయినింగ్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా రావు.
Read Also: మాల్దీవులకు అర్థమైంది.. తుర్కియోకు అర్థమవుతోంది..భారత్ తో గెలుక్కుంటే అంతే సంగతులు!
మధ్యలో మానేయవద్దు
జాబ్ మానేయాలని ప్లాన్ ఉంటే మధ్యలో మానేయవద్దు. రిజైన్ పెట్టి నోటీస్ పీరియడ్ చేయండి. ఆ తర్వాతే జాబ్ మానేయండి. అంతే కానీ సడెన్‌గా జాబ్ మానేస్తే చివరి నెల జీతం కూడా రాదు. ఫ్రొఫెషనల్‌గా రిజైన్ లేఖ పెట్టిన తర్వాత మాత్రమే జాబ్ మానేయండి.
సెలవులు వినియోగించుకోండి
ప్రతి ఎంప్లాయికి సెలవులు ఉంటాయి. అయితే ఉన్న సెలవులను తప్పకుండా వినియోగించుకోండి. సెలవులును వినియోగించుకోకుండా రిజైన్ పెడితే మాత్రం వేస్ట్ అయిపోతాయి. నోటీస్ పీరియడ్‌లో అసలు సెలవులు ఇవ్వరు. కాబట్టి ముందే మీ సెలవులను వినియోగించుకోండి.
వర్క్ తెలియజేయండి
మీ ప్లేస్‌లో జాయిన్ అయ్యే వారికి లేదా మేనేజర్‌కి వర్క్ తెలియజేయండి. దీనివల్ల మీరు ఉద్యోగం మానేసినా పెద్ద సమస్య ఉండదు. లేకపోతే మీరు ఉద్యోగం మానేసినా కూడా మళ్లీ వర్క్ కోసం మీతో కాంటాక్ట్ అవుతారు. ఇలా కాకుండా ఉండాలంటే మీరు ముందుగానే అన్ని విషయాలు కూడా తెలియజేయండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే
-
Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది
-
Joint Problems: ఉప్పుతో ఇలా చేస్తే కీళ్ల సమస్యలన్నీ పరార్
-
Weight Lose: వెయిట్ తగ్గాలని అధికంగా రన్నింగ్ చేస్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?