AC: ఆన్‌లైన్‌లో ఏసీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి

AC:
వేసవి కాలం వచ్చేస్తుంది. ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతను భరించలేక చాలా మంది కూలర్, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. చల్లదనం కోసం చాలా మంది వేసవిలో తప్పకుండా ఏసీలు కొంటారు. డబ్బులు లేకపోయినా కూడా అప్పులు చేసి మరి తీసుకుంటారు. అయితే కొందరికి బయటకు వెళ్లే తీరిక ఉండదు. దీంతో స్టోర్‌కి వెళ్లి కాకుండా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తుంటారు. తాత్కాలికంగా ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తుందా లేదా అని ఆలోచిస్తారు. కేవలం ఈ వేసవి కాలానికి ఏసీ పనిచేస్తే చాలు.. ఇంకా నెక్ట్స్ ఇయర్‌కి తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటారు. దీంతో ఏం ఆలోచించకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతుంటారు. అయితే ఆన్‌లైన్‌లో ఏసీ కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం.
ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవద్దు
ఆన్‌లైన్‌లో మీరు ఏసీ కొనుగోలు చేయాలనుకుంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకోవద్దు. మీకు ఎంత బడ్జెట్‌లో కావాలో అంతలోనే తీసుకోండి.
కావాల్సిన ఫీచర్లు మాత్రమే ఎంచుకోండి
మీకు ఎలాంటి ఫీచర్లు, ఏ కంపెనీవి కావాలో వాటిని మాత్రమే తీసుకోండి. ఆన్‌లైన్‌లో చూసేటప్పుడు ఎన్నో కొత్త కొత్త కంపెనీలవి కనిపిస్తుంటాయి. మీరు వీటి జోలికి పోవద్దు. దీనివల్ల మీ డబ్బులు వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్లవి మాత్రమే తీసుకోండి.
రూమ్ సైజ్ బట్టి
కొందరి గదులు పెద్దగా ఉంటే.. మరికొందరు గదులు చిన్నగా ఉంటాయి. మీ గది బట్టి పెద్ద ఏసీ లేదా చిన్నది అనేది తీసుకోండి. ఇద్దరు మనుషులకి అయితే చిన్నది సరిపోతుంది. అదే ఎక్కువ మంది అయితే పెద్ద ఏసీ తీసుకోవడం బెటర్.
కూలింగ్ ఎక్కువ ఉండేది
వేసవిలో బాగా ఉక్కపోతగా ఉంటుంది. కాబట్టి కూలింగ్ ఎక్కువగా ఉండే ఏసీనే తీసుకోండి. దీనివల్ల మీకు చల్లదనం లభిస్తుంది. లేకపోతే ఏసీ తీసుకున్న కూడా ప్రయోజనం ఉండదు.
సామర్థ్యం ఎక్కువ ఉన్నది
ఏసీ ఎక్కువగా సామర్థ్యం ఉన్నది తీసుకోండి. దీనివల్ల మీ ఏసీ కూడా ఎక్కువ కాలం వస్తుంది. ఎక్కువ సామర్థ్యం ఉంటే మీరు బాగా వాడినా కూడా ఎలాంటి సమస్య ఉండదు.
స్ల్పిట్ ఏసీలు
ఇవి అయితే ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి. అలాగే ఎక్కువ కాలం మన్నికను ఇస్తాయి. దీనివల్ల ఇంట్లో ఉన్న వాళ్లందరికీ కూడా ఏసీ ఉపయోగపడుతుంది. అలాగే చల్లదనం లభిస్తుంది. లేకపోతే ఏసీ కొన్ని కూడా ఫలితం ఉండదు. కాబట్టి ఈ స్ల్పిట్ ఏసీలు తీసుకోండి. వీటివల్ల మీకు ప్రయోజనాలు ఉంటాయి. వచ్చిన తర్వాత కూడా వీటిని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో కొన్ని పాడైన ప్రొడక్ట్స్ వస్తుంటాయి.