AC Tips: వేసవిలో ఏసీ పేలకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఎక్కువగా వేసవిలో ఏసీ వాడటం వల్ల అవి పేలిపోతాయి. ఉష్ణో్గ్రతలు పెరిగిపోవడం వల్ల కండెన్సర్‌పై బాగా ఒత్తిడి పడుతుంది. దీంతో ఒక్కసారిగా కండెన్సర్ పేలిపోతుంది. మన దేశంలో కండెన్సర్ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.

AC Tips: వేసవిలో వేడి తీవ్రతను తట్టుకోలేక చాలా మంది ఏసీలు వాడుతుంటారు. ఇవి అయితే కూల్‌గా ఉంచుతాయని భావించి కొంటారు. వేసవి వస్తే చాలు ఏ కంపెనీ ఏసీ ఏంటని తెలుసుకోకుండా వెంటనే కొనుగోలు చేస్తారు. ఏసీలో కొన్ని నాసి రకాలు కూడా ఉంటాయి. వీటివల్ల ఏసీ వాడుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మంచి ఏసీలు కాకపోతో కొన్ని సార్లు పేలిపోతాయి. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. అయితే ఏసీని కొందరు ఏడాదంతా వాడుతారు. అప్పుడు ఎందుకు పేలవనే సందేహం మీకు రావచ్చు. మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో ఏసీలు పేలిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వేసవిలో ఎక్కువగా ఏసీ వాడుతారు. వేడి తీవ్రత నుంచి తట్టుకోవడానికి చాలా మంది ఏసీని 24 గంటల పాటు కూడా వాడుతుంటారు. క్వాలిటీవి అయితే మీరు ఎంత వాడినా కూడా ఏం కాదు. కానీ నాసిరకం అయితే తొందరగా పాడవుతాయి. అయితే వేసవిలో ఏసీ పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎక్కువగా వేసవిలో ఏసీ వాడటం వల్ల అవి పేలిపోతాయి. ఉష్ణో్గ్రతలు పెరిగిపోవడం వల్ల కండెన్సర్‌పై బాగా ఒత్తిడి పడుతుంది. దీంతో ఒక్కసారిగా కండెన్సర్ పేలిపోతుంది. మన దేశంలో కండెన్సర్ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. దీని కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగితే మాత్రం అవి తట్టుకోలేవు. దీంతో అవి ఒక్కసారిగా పేలిపోతాయి. కేవలం ఉష్ణోగ్రతలు మాత్రమే కాకుండా కండెన్సర్ నుంచి గ్యాస్ లీక్ అయినా కూడా ఏసీ పేలిపోతుంది. ఎందుకంటే గ్యాస్ తగ్గితే కండెన్సర్‌పై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. దీంతో కండెన్సర్ బాగా వేడెక్కి పేలిపోతుంది. వేడి నుంచి మీకు విముక్తి కలిగి చల్లగా ఉండాలంటే మాత్రం తప్పకుండా కండెన్సర్ కావాలి. గదిని అంతటిని ఈ కండెన్సర్ చల్లగా ఉంచుతుంది. అయితే కొన్నిసార్లు కండెన్సర్‌లె కాయిల్స్ మురికి అవుతాయి. దీంతో గ్యాస్ సరఫరాలో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. దీనివల్ల కూడా కొన్నిసార్లు కండెన్సర్ వేడెక్కుతుందని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో కండెన్సర్ పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏసీ పేలకుండా ఉండాలంటే కండెన్సర్ సక్రమంగా పనిచేయాలి. ఇది కనుక బాగా ఒత్తిడికి గురైతే మాత్రం తప్పకుండా పేలిపోతుందని నిపుణులు అంటున్నారు. వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులు ఉంటే మాత్రం అది కండెన్సర్‌పై బాగా ప్రభావం చూపుతుంది. దీంతో ఏసీ పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో ఏసీ విషయంలో కాస్త జాగ్రత్తలు వహించండి. ఏసీ పేలకుండా ఉండకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కూడా కండెన్సర్ క్లిన్ చేయాలి. అలాగే అల్యూమినియం, కాపర్‌తో తయారు చేసిన ఏసీలు మార్కెట్‌లో దొరుకుతాయి. వీటిని వాడితే ఎలాంటి సమస్య ఉండదు. వీటిలో తక్కువ ధరకు లభించేవి, ఎక్కువ ధరలకు లభించేవి కూడా దొరుకుతాయి. వీటిని వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు.