Power Bill: వేసవిలో కరెంట్ బిల్ తక్కువగా రావాలా? ఈ చిట్కాలు పాటించండి

Power Bill:
వేసవి కాలం వచ్చేసింది. భగ భగ మండే ఎండలకు తట్టుకోలేక చాలా మంది ఫ్యాన్‌లు, ఏసీ, కూలర్లను ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడితే తప్పకుండా కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందనే విషయం తెలిసినా కూడా మనం వీటిని ఎక్కువగా వాడుతుంటాం. అయితే కరెంట్ బిల్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. మరి పాటించాల్సిన ఆ చిట్కాలేంటో చూద్దాం.
మీరు వేసవిలో ఫ్యాన్‌లు, ఏసీ, బల్బులు, ఫ్రిడ్జ్, కూలర్లు వంటివి కొనేటప్పుడు ముందే చూసుకోవాలి. ఇవి ఎంత కరెంట్‌ను ఇస్తుందో దాని రేటింగ్ బట్టి మీరు కొనాలని నిపుణులు చెబుతున్నారు. కేవలం 5 స్టార్ రేటింగ్ ఉన్న వాటిని తీసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది. పెద్దగా మీకు కరెంట్ బిల్లు కూడా రాదు. వేసవిలో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు ఏసీని 24 డిగ్రీల సెంట్రీగ్రేడ్‌లో మాత్రమే పెట్టుకోండి. దీనివల్ల మీకు కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. అలాగే మీ ఏసీ కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్నదే తీసుకోండి. అలాగే మార్కెట్‌లో ఇన్‌వర్టర్, డ్యూయెల్ ఇన్‌వర్టర్ ఏసీలు ఉంటాయి. వీటిలో మీరు ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసిన ఉష్ణోగ్రత వచ్చిన వెంటనే ఏసీలు ఆటోమెటిక్‌గా బంద్ అవుతాయి. దీనివల్ల కాస్త విద్యుత్ ఆదా అవుతుంది. వేసవిలో ఏసీల ఫిల్టర్లను శుభ్ర చేసుకోవాలి. వీటికి కొంత సమయం పెట్టుకోవాలి. దీని వల్ల కరెంట్ ఆదా అవుతుంది. వేసవికి ముందే ఏసీల ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. ఫిలమెంట్, సీఎఫ్ఎల్ బల్బులు కాకుండా వేసవిలో ఎల్ఈడీ బల్బులను ఎక్కువగా ఉపయోగించండి. అలాగే బీఎల్డీ ఫ్యాన్‌లను వాడటం అలవాటు చేసుకోండి.
వేసవిలో ఫ్రిడ్జ్ వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు వేసవి ఫ్రిడ్జ్ వాడకాన్ని కాస్త తగ్గించాలి. వాతావరణం బట్టి ఫ్రిడ్జ్ సెట్టింగ్‌లను మీరు మార్చుకోవాలి. అలాగే బీఈఈ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్‌లను కొనుగోలు చేయాలి. అలాగే వేసవిలో ఎక్కువ సార్లు ఫ్రిడ్జ్ డోర్ తీయకూడదు. తక్కువగా మాత్రమే తీయాలి. కొందరు కారణం లేకపోయినా కూడా పదే పదే ఫ్రిడ్జ్ డోర్‌లు తీస్తుంటారు. ఇలా చేస్తే మాత్రం తప్పకుండా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. కొందరు టీవీని కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఒకవేళ ఆపినా కూడా రిమోట్‌లో ఆపుతారు. ఇలా ఆపినా కూడా కరెంట్ పాస్ అవుతుంది. టీవీకి ఉన్న స్విచ్ ఆపితేనే పవర్ ఆగుతుంది. దీంతో కూడా మీకు వేసవిలో ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుంది. కాబట్టి ఈ నియమాలు తప్పకుండా పాటించి కరెంట్ బిల్లును తగ్గించుకోండి.