iPhone 17 : ఐఫోన్ 17 ప్రో లీక్డ్ డిజైన్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!

iPhone 17 : ఆపిల్ తన తర్వాతి ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఐఫోన్ 17పై ప్రస్తుతం పనిచేస్తోంది. ఈ సిరీస్‌లో రాబోయే ఐఫోన్ 17 ఎయిర్ ఇప్పటికే చర్చల్లో ఉండగా ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దీని డిజైన్‌కు సంబంధించిన కొన్ని మార్పులు బయటకు వచ్చాయి. ఇవి ఐఫోన్ 16 ప్రో నుంచి దీన్ని చాలా భిన్నంగా చూపిస్తున్నాయి. ఆపిల్ మునుపటి ఫోన్ కొత్త ఫోన్‌తో ఎలా భిన్నంగా ఉంటుందో వివరంగా తెలుసకుందాం.
కొత్త కెమెరా డిజైన్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం ఐఫోన్ 17 ప్రో ఒక ఫేక్ శాంపిల్ చూపించారు. ఈ శాంపిల్ లో కెమెరా డిజైన్‌లో అతిపెద్ద మార్పు కనిపించింది. ఐఫోన్ 16 ప్రోలో కెమెరా వెనుకవైపు ఎడమ వైపు పైకి ఉండగా.. ఐఫోన్ 17 ప్రోలో ఈ కెమెరా మొత్తం వెడల్పుగా ఫోన్ వెనుక భాగానికి విస్తరించి ఉంది. ఈ డిజైన్ కొంతవరకు గూగుల్ పిక్సెల్ ఫోన్‌ల వలె కనిపిస్తోంది. కానీ కెమెరా, ఫ్లాష్, సెన్సార్ మధ్య ఎక్కువ ఖాళీ స్థలం కూడా కనిపిస్తోంది. కాబట్టి, ఆపిల్ ప్రతిసారి లాగానే తన రాబోయే ఐఫోన్ కెమెరాలో ఏదైనా స్పెషాలిటీని తీసుకువస్తుందా లేదా అని చూడాలి.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
ఫోన్ మిగిలిన భాగాలలో పెద్దగా మార్పులు కనిపించలేదు. యాక్షన్ బటన్, వాల్యూమ్ బటన్లు, పవర్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్లు పాత స్థానంలోనే ఉండవచ్చు. స్క్రీన్ సైజు కూడా ఐఫోన్ 16 ప్రో వలెనే ఉంటుందని భావిస్తున్నారు. అంటే, ఈసారి కంపెనీ డిజైన్‌పై కాకుండా కెమెరాపై ఎక్కువ దృష్టి పెడుతోంది.
కెమెరా, బాడీ
ఈసారి ఆపిల్ మళ్లీ అల్యూమినియం బాడీని ఉపయోగించే అవకాశం ఉంది. దీనివల్ల ఫోన్ తేలికగా, కొంచెం తక్కువ ధరలో ఉండవచ్చు. దీనితో పాటు ముందు కెమెరా 24 మెగాపిక్సెల్‌తో ఉండవచ్చు. ఇది మునుపటి కంటే రెట్టింపు క్వాలిటీని అందించగలదు. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు జూమ్ లెన్స్ మరియు అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంటాయి.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
ఇక్కడ చెప్పిన అన్ని వివరాలు లీక్‌ల ప్రకారం మాత్రమే. ఆపిల్ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. కంపెనీ కొత్త ఐఫోన్‌ను ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది.
-
Blood Sugar : బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఈ పండ్లను తినొద్దు
-
Password Leak : 1600కోట్ల గూగుల్, యాపిల్ పాస్ వర్డ్ లు లీక్ అయ్యాయట.. తస్మాత్ జాగ్రత్త
-
Trump Mobile : ఐఫోన్ 17కు పోటీగా ట్రంప్ మొబైల్.. భారత మార్కెట్‌లోకి వస్తుందా? రేటు ఎంతంటే ?
-
Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
-
Uric Acid: యూరిక్ యాసిడ్ ఇబ్బంది పెడుతుందా.. ఈ ఫుడ్స్ తీసుకోండి