Uric Acid: యూరిక్ యాసిడ్ ఇబ్బంది పెడుతుందా.. ఈ ఫుడ్స్ తీసుకోండి

Uric Acid:
ఈ మధ్య కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే గుర్తిస్తే పర్లేదు. కానీ ఎక్కువ రోజులు గుర్తించకుండా ఉంటే మాత్రం సమస్య తీవ్రం అవుతుంది. యూరిక్ యాసిడ్‌ను సరైన సమయంలో గుర్తించకపోతే మాత్రం ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యూరిక్ యాసిడ్‌కి ఎన్ని మందులు వాడినా కూడా ఫలితం ఉండదు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే మాత్రం పోషకాలు ఉండే కొన్ని ఫుడ్స్‌ను తగ్గించుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఏవి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
బెర్రీస్
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీస్‌ను తినడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి మెరుగుపడటంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వీటిని డైలీ తింటే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. వీటిని డైలీ ఉదయం లేదా సాయంత్రం వేళలో తింటే ప్రయోజనాలు ఉంటాయి.
ఆపిల్
ఆపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటలో మాలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది. డైలీ ఒక ఆపిల్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యంగా ఉంటారు.
నిమ్మ
నిమ్మలో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది. రోజుకి ఒకసారి కాదు రెండు నుంచి మూడు సార్లు నిమ్మ రసం తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఫ్రెంచ్ బీన్ రసం
ఈ రసం రోజుకి రెండుసార్లు తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి విముక్తి పొందుతారు. ఇందులోని పోషకాలు సమస్యను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఆపిల్ సైడర్ వినిగర్
దీంట్లోని క్రిస్టల్స్ యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని ఫోలిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది. దీంతో మీ సమస్య తొందరగా క్లియర్ అవుతుంది.
ఏబీసీ జ్యూస్
క్యారెట్, బీట్ రూట్, ఆపిల్ జ్యూస్ డైలీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య నుంచి విముక్తి పొందుతారు. ఇందులోని పోషకాలు సమస్యను తగ్గించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అలాగే ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.
ఫైబర్ ఫుడ్స్
ఫైబర్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. ఓట్స్, బ్రొకోలీ, నారింజ, దోసకాయలు, బీరకాయ వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మీరు ఈ యూరిక్ యాసిడ్ సమస్య నుంచి విముక్తి పొందుతారు.
-
Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
-
Uric acid : ఇలా చేస్తే యూరిక్ యాసిడ్ తగ్గడం ఖాయం
-
ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు
-
Telangana: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లు ప్రారంభం.. వీటికి దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే?
-
Fruits Packing : పండ్లను పేపర్ లో చుట్టి పెట్టడం వెనుక ఇంత రహస్యం ఉందా?
-
Health Tips : ఈ ఫుడ్స్ తీసుకుంటే.. థైరాయిడ్ సమస్య ఔట్