Life Lessons: నీ చుట్టూ ఎవరు ఉంటారో.. వారే బట్టే నీ భవిష్యత్తు?

Life Lessions: తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటే అసలు తులసి వాసన ఉండదు అన్నట్లు.. మన చుట్టూ ఎవరు ఉన్నారనే దాని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మన ఇంట్లోని పెద్దవాళ్లు ఈ విషయం ఎప్పుడు చెబుతుంటారు. బాగా చదివిన, మంచి వారితో కలిసి తిరగడం వల్ల ఆ అలవాట్లు మీకు వస్తాయని, అలాంటి వారితోనే తిరగమని అంటుంటారు. ఈ విషయం తెలిసినా కూడా కొందరు పట్టించుకోరు. వారికి నచ్చినట్లు ఉంటారు. నిజానికి ఒక తెలివైన వ్యక్తి, బాగా చదివిన వ్యక్తి జల్సాగా తిరిగే వారితో ఉంటే.. అదే అలవాటు అవుతుంది. వారికి ఉన్న మంచి అలవాట్లు అన్ని కూడా పోతాయి. అదే ఒక మంచి వ్యక్తితో తిరిగితే వారిలాగానే చదువుతారు. చెడు వాటిపై కాకుండా మంచి వాటిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. అన్ని విధాలుగా కూడా వారు మంచి పొజిషన్లో ఉంటారు.
ఉదాహరణకు మీకు ఒక స్టోరీ చెబుతా.. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఉదయం తొందరగా లేచి, అన్ని పనులు చేసి రాత్రి సమయాల్లో తొందరగా నిద్రపోతారు. ఇంకో వ్యక్తి రోజూ ఆలస్యంగా లేవడం, బద్ధకంగా ఉండటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చెడు వ్యక్తి మంచిగా మారడు. కానీ మంచి వ్యక్తి చెడుగా మారుతాడు. బద్ధకంగా తయారవుతాడు. ఎప్పుడైనా కూడా మంచి తొందరగా అలవాటు కాదు.. కానీ చెడు మాత్రం తొందరగా అలవాటు అవుతుంది. కాబట్టి మీ చుట్టూ ఎవరు ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఉదాహరణకు మీరు ఎక్కడైనా చదువుకు వెళ్తే చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారు, ఎలాంటి వారితో స్నేహం చేయాలని ముందుగా ప్రిపేర్ అవ్వండి. మంచి వారితో మాత్రమే స్నేహం చేయండి. అప్పుడే మంచి జరుగుతుంది. లేకపోతే మీ జీవితం అంతా కూడా నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా చెడు అలవాట్లకు చాలా మంది బానిస అవుతున్నారు. వారితో తిరిగి మంచి వారు కూడా బానిసలుగా మారుతున్నారు. ఈ తరం యువత ఎక్కువగా చిన్న వయస్సులోనే చెడు అలవాట్లకు దగ్గర అవుతుంది. ఎక్కువగా మద్య పానం, ధూమ పానం వాటికి బానిస అవుతుంది. వీటివల్ల వారి జీవితాన్ని చిన్న వయస్సులోనే నాశనం చేసుకుంటున్నారు. మంచిగా చదివి, ఒక గొప్ప పొజిషన్లో ఉండాల్సిన వారు కూడా చివరకు డ్రగ్స్ వంటి వాటికి బానిసలుగా మారి కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇకనైనా మీరు ఏం చేస్తున్నారో, మీ చుట్టూ ఉన్నవారు ఎవరో గమనించండి. మంచి వారితో మాత్రమే స్నేహం చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు జీవితంలో గొప్పగా ఉంటారు. అలాగే పెద్దవాళ్లు అంటే ఇంట్లో ఉన్న అమ్మ నాన్న ఇలా ఎవరైనా కావచ్చు. ఏదైనా చెబితే అర్థం చేసుకోండి. అంతే కానీ మీరేందుకు నాకు చెబుతున్నారని వినకుండా గొడవలు చేసి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు గొప్ప వారు అయ్యేలా చూసుకోండి. అప్పుడు మీకు కూడా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి.
ఇది కూడా చూడండి: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
-
Breakup: బ్రేకప్‌తో సతమతమవుతున్నారా.. బయటపడాలంటే ఇలా చేయండి
-
Garuda Purana : ఈ 5 రకాల వారితో సావాసం చేస్తే వినాశనం తప్పదు..జాగ్రత్తగా ఉండమంటున్న గరుడ పురాణం!
-
Woman : మన ఇంటిని చక్కదిద్దే మహిళకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి?
-
BCCI: ఆ రూల్ మార్చం.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ
-
BCCI: కుటుంబానికి నో ఎంట్రీ.. కోహ్లీ వ్యాఖ్యలపై తగ్గిన బీసీసీఐ