BCCI: కుటుంబానికి నో ఎంట్రీ.. కోహ్లీ వ్యాఖ్యలపై తగ్గిన బీసీసీఐ
BCCI బీసీసీఐ పెట్టిన రూల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరిగిన తర్వాత ఒంటరిగా రూమ్‌లో కూర్చోని ఎడవాలా? కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడిపితే రిలాక్స్ గా ఉంటుంది.

BCCI: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఓడిపోతే బీసీసీఐ టీమిండియా క్రికెటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఛాంపియన్స్ ట్రోపీ జరిగింది. ఈ సమయంలో బీసీసీఐ ఆటగాళ్ల విషయంలో కొన్ని కండీషన్స్ పెట్టింది. ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులను తీసుకెళ్లకూడదని తెలిపింది. 45 రోజుల కంటే ఎక్కువ రోజలు టోర్నీ ఉంటేనే ఆటగాళ్లు తమ కుటుంబాలను తీసుకెళ్లాలి. లేకపోతే తీసుకెళ్లకూడదని తెలిపింది. ఒకవేళ తీసుకొచ్చినా కూడా కుటుంబ సభ్యుల ఖర్చు అంతా కూడా ఆటగాడే భరించాలి. అయితే వీటిపై ఆటగాళ్లు అందరూ కూడా కండించారు. అయినా కూడా బీసీసీఐ ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ వీటిపై స్పందించాడు.
బీసీసీఐ పెట్టిన రూల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరిగిన తర్వాత ఒంటరిగా రూమ్‌లో కూర్చోని ఎడవాలా? కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడిపితే రిలాక్స్ గా ఉంటుంది. కుటుంబంతో సమయం గడిపే ఏ నిమిషాన్ని కూడా నేను వృథా చేసుకోనని తెలిపాడు. కుటుంబంతో కలిసి ఉండే ప్రతీ అవకాశాన్ని కూడా నేను యూజ్ చేసుకుంటానని, ఫ్యామిలీస్ కూడా ఉంటే బాగుంటుందని తెలిపాడు. దీనిపై మిగతా క్రికెటర్లు కూడా కోహ్లీ బాటలోనే నడిచారు.
కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో బీసీసీఐ దిగొచ్చింది. కుటుంబాన్ని కూడా తీసుకురావడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబాన్ని విదేశీ పర్యటనకు తీసుకురాకూడదనే నిర్ణయాన్ని సవరించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 45 రోజులు కంటే ఎక్కువ పర్యటనకు కూడా కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకెళ్లాలనుకునే ఆటగాళ్లు ముందుగా బీసీసీఐ నుంచి అనుమతి పొందాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీసీసీఐ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే.. తర్వాత ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపినట్లు సమాచారం. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
-
Woman : మన ఇంటిని చక్కదిద్దే మహిళకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి?
-
IPL 2025: ఐపీఎల్లో ఖరీదైన టాప్ ప్లేయర్లు వీరే
-
IPL 2025 : ఐపీఎల్లో అంపైర్‌గా అండర్ 19 కప్ హీరో
-
BCCI: టీమిండియా ఆటగాళ్లు నక్క తోక తొక్కారు పో
-
BCCI: ఆ రూల్ మార్చం.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ
-
Virat Kohli: ఆ కుర్రాడు మేలిమి బంగారం.. 17 సంవత్సరాల నిరీక్షణకు తెర దించుతాడు..