Woman : మన ఇంటిని చక్కదిద్దే మహిళకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి?
Woman : ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో తన ఆరోగ్యం కూడా ఆమెకు అంతే ముఖ్యం. తనకు మాత్రమే కాదు. పూర్తి కుటుంబ ఆరోగ్యం తన చేతిలోనే ఉంటుంది. కానీ నేటి సమాజంలో బిజీ లైఫ్ వల్ల తను మాత్రమే కాదు తనతో ఉండే ఎవరు ఆ ఇల్లాలి గురించి ఆలోచిస్తున్నారు?

Woman : ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో తన ఆరోగ్యం కూడా ఆమెకు అంతే ముఖ్యం. తనకు మాత్రమే కాదు. పూర్తి కుటుంబ ఆరోగ్యం తన చేతిలోనే ఉంటుంది. కానీ నేటి సమాజంలో బిజీ లైఫ్ వల్ల తను మాత్రమే కాదు తనతో ఉండే ఎవరు ఆ ఇల్లాలి గురించి ఆలోచిస్తున్నారు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒల్లు ఊనమయ్యేలా, ఇంటి ఆరోగ్యమే తన బాధ్యతగా పని చేసే ఆ మహిళ ఆరోగ్యం గురించి నిజంగా మీరు ఆలోచిస్తున్నారా? ఇంట్లో అత్త కాకిలా పొడుస్తుంటుంది, ఆడపడుచులు అరుస్తుంటారు. భర్త భరించడు. పిల్లలు విసిగిస్తుంటారు. అయినా సరే ఆ మహిళ సహనం కోల్పోదు. తన కోపాన్ని ఎవరి మీద చూపించదు. నిజంగా తను గ్రేట్ కదా..
ఉదయం నాలుగు గంటలకు తన ప్రయాణం మొదలైతే ఆ జర్నీ రాత్రి వరకు కూడా ఆగదు. అలిసిపోయి హాయిగా నిద్ర పోదాం అనుకుంటే ఆ గడియారం నాలుగు గంటలు నిద్రపోయేకంటే ముందే కూస్తుంది. అంటే తను కనీసం రోజు నాలుగు గంటలు కూడా నిద్ర పోదు. కానీ ఒక్కరైనా తనకు ప్రేమగా ఓ టీ, కాపీ ఇస్తారా? రోజు కాదు, కనీసం వారానికి, నెలకు ఒకసారి అయినా తనతో ప్రేమగా మాట్లాడుతున్నారా? మరి తన కష్టం, తన త్యాగం ఎవరి కోసం అంటారు?
కేవలం పెళ్లి అనే బంధంతో ఏకమై మీ ఇల్లే తన సర్వస్వం అనుకొని సంతోషాలను పక్కన పెట్టి, బాధలను పంటికింద దాచుకొని, చిరునవ్వుతో మిమ్మల్ని పలకరిస్తూ మీ పనులు చేస్తూ ఉన్న తనకోసం ఒక చిన్న చిరునవ్వు ఓ చిన్న కాంప్లిమెంట్ అయినా సరిపోదా? కానీ మీరు ఇస్తున్నారా? ఇంటి పని, వంట పని, భర్త, అత్తమామ, పిల్లలు ఇలా అందరూ కూడా పని కోసం తనను పిలుస్తారు. కానీ తనకు సహాయం వస్తే మాత్రం చేయరు. సహాయం పక్కన పెడితే మీ నుంచి పాజిటివ్ ను మాత్రం ఆశిస్తుంది ఆ పడతి.
తను ఆరోగ్యంగా ఉంటేనే మీ ఇల్లు బాగుంటుంది. తన అందమే మీ ఇంటికి అలంకరణ. మీకోసమే పరితపిస్తున్న ఆ ఇల్లాలి మనసు నొచ్చుకోకుండా, నొప్పించుకుండా ఉంటూ కాస్త తనకు చేదోడు వాదోడుగా ఉంటే చిన్న లైఫ్ ను స్వర్గంలా భావించి ముందుకు సాగుతుంది మీ భార్య. అమ్మ మాతో కూర్చొని నువ్వు కూడా తిను అంటే కళ్ల నిండా నీళ్ళు తెచ్చుకొని సగం ప్లేట్ కే కడుపునిండినట్టు ఫీల్ అవుతుంది ఆ అమ్మ. రా అమ్మ, కలిసి టీ తాగుదాం. తర్వాత చేద్దువులే పని అని అత్త పిలిస్తే ఉదయం నుంచి చేసిన పనిని మర్చిపోతుంది ఆ కోడలు. తనొక గొప్ప మహిళ, అలుపు లేని పడతి. భూమికి ఉన్న సహనాన్ని గుండెల్లో నిలుపుకొని మీ కోసం ఏదైనా చేసే త్యాగ మూర్తి. మరి తన సంతోషం కోసం మీరు కూడా కాస్త మారండి.
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
North America: ఉత్తర అమెరికాలో భూగర్భ చినుకులు ఎందుకు వస్తున్నాయో తెలుసా?
-
BCCI: ఆ రూల్ మార్చం.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ
-
BCCI: కుటుంబానికి నో ఎంట్రీ.. కోహ్లీ వ్యాఖ్యలపై తగ్గిన బీసీసీఐ
-
Children : ఈ వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచండి. లేదంటే వారి ప్రాణాలకే ప్రమాదం..
-
Children : పిల్లల కళ్ళకు కాటుక పెడుతున్నారా? దీని వల్ల వారికి మంచా? చెడా?