Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Rocking Rakesh Daughter Khyathikas Annaprashana Ceremony Cute Photos Go Viral

Rocking Rakesh : ఘనంగా రాకింగ్ రాకేష్ కూతురి అన్నప్రాసన వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Rocking Rakesh  : ఘనంగా రాకింగ్ రాకేష్ కూతురి అన్నప్రాసన వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు
  • Edited By: rocky,
  • Updated on June 23, 2025 / 03:45 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Rocking Rakesh : తెలుగు ప్రేక్షకులను ఏళ్ళ తరబడి నవ్విస్తూ, బుల్లితెరపై తిరుగులేని కామెడీ షోగా కొనసాగుతున్న జబర్దస్త్. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్లు స్టార్‌లుగా ఎదిగి, సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. అలాంటి వారిలో తనదైన కామెడీ టైమింగ్‌తో, వైవిధ్యమైన స్కిట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రాకింగ్ రాకేష్. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లలోనే కాకుండా ఇతర కామెడీ షోలలో కూడా మెరిసిన రాకేష్, తన కామెడీతో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

రాకేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే బుల్లితెరపైనే పరిచయమైన జోర్దార్ సుజాతతో ప్రేమలో పడి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సెలబ్రిటీ జంట గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు, ఈ దంపతులు తమ అభిమానులకు ఓ తీపి కబురు అందించారు. ఫాదర్స్ డే సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్‌ని రివీల్ చేసి సర్‌ప్రైజ్ చేసిన రాకేష్, తాజాగా తన కూతురు అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read Also:Credit Score : పదే పదే చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా.. నిజమిదే ?

రాకేష్-సుజాత దంపతులకు పాప పుట్టిన తర్వాత, చాలా సందర్భాల్లో బయట కనిపించినా, తమ కూతురి ముఖాన్ని ఎప్పుడూ చూపించకుండా జాగ్రత్త పడ్డారు. సోషల్ మీడియాలో కూడా పాప ఫోటోలు షేర్ చేసినా, ముఖం కనిపించకుండా చూసుకునేవారు. అయితే, ఇటీవలే వచ్చిన ఫాదర్స్ డే సందర్భంగా రాకేష్ తమ ముద్దుల కూతురి ఫేస్‌ని రివీల్ చేస్తూ, అభిమానులతో ఆ సంతోషాన్ని పంచుకున్నాడు.

ఇప్పుడు ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ, ఈ దంపతులు తమ కూతురు ఖ్యాతికకు అన్నప్రాసన వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో చిట్టితల్లి ఖ్యాతిక చాలా ముద్దుగా కనిపించింది. రాకేష్, సుజాత దంపతులు కూడా తమ కూతురుతో కలిసి సంతోషంగా ఫోజులిచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు, వీడియోలు త్వరలోనే బయటికి వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also:UPI : యూపీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త

Tag

  • Jabardasth Celebrities
  • Jabardasth Rakesh
  • Jordar Sujatha
  • Khyathika Annaprashana
  • Rocking Rakesh Daughter
Related News
    Latest Photo Gallery
    • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

    • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

    • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

    • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

    • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

    • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

    • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

    • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

    • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us