Kollywood: తమిళంలో హిట్… తెలుగులో ఫ్లాప్.. అసలు కోలివుడ్‌కి ఏమైంది?
Kollywood అజిత్, విజయ్, సూర్య వంటి టాప్ స్టార్‌ల సినిమాల పరిస్థితి కూడా ఇదే. గత నెలలో గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ మూవీ వచ్చింది. ఈ సినిమా తమిళంలో మంచి కలెక్షన్లు రాబట్టింది.

Kollywood: ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీ అత్యుత్తమ సినిమాలకు పెట్టింది పేరు. ఎక్కువ హిట్ సినిమాలు ఇందులోనే ఉండేవి. కానీ గత కొన్నేళ్ల నుంచి తమిళ సినిమాలు అసలు మంచి హిట్ సంపాదించలేకపోతున్నాయి. కోలీవుడ్‌కి ఇండస్ట్రీలో ఉన్న పేరును పోగొట్టుకుంది. గతంలో ఎందరో డైరెక్టర్లు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తీశారు. కానీ ఇప్పుడు మాత్రం చెప్పుకునేంత గొప్పగా అయితే లేదు. నిజం చెప్పాలంటే తమిళంలో కొత్త దర్శకులు పెద్దగా మెప్పించడం లేదు. తమిళంలో ఎక్కువగా సరికొత్త సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు సాధారణ సినిమాలకు కూడా తమిళ నెటిజన్లు ఆహా అంటున్నారు. తమిళంలో సినిమాలు హిట్ అవుతున్నా కూడా తెలుగులో మాత్రం హిట్ కావడం లేదు. తమిళ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలు హిట్ అయ్యి.. మంచి కలెక్షన్లు రాబడుతున్నా కూడా తెలుగులో మాత్రం కావడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలు అయితే చెప్పక్కర్లేదు. తెలుగు ప్రజలు తమిళ సినిమాలను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం తమిళ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడటం లేదు.
అజిత్, విజయ్, సూర్య వంటి టాప్ స్టార్‌ల సినిమాల పరిస్థితి కూడా ఇదే. గత నెలలో గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ మూవీ వచ్చింది. ఈ సినిమా తమిళంలో మంచి కలెక్షన్లు రాబట్టింది. అలాగే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. ఇక ఇటీవల సూర్య రెట్రో వచ్చింది. నిజానికి సూర్యకి తెలుగులో ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు వారి దత్తపుత్రుడిగా భావిస్తారు. సూర్య మూవీ వస్తుందంటే.. కొత్త స్టోరీతో ముందుకు వస్తున్నాడని భావిస్తారు. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు. అయితే గత కొన్ని రోజుల నుంచి సూర్యకి మంచి హిట్ పడటం లేదు. ఇటీవల రిలీజ్ అయిన కంగువ కూడా పెద్దగా ఆడలేదు. ఇక తాజాగా రిలీజ్ అయిన రెట్రో కూడా పెద్దగా హిట్ ఇవ్వలేదు. తమిళంలో మంచి హిట్‌ను ఇచ్చినా కూడా తెలుగులో మాత్రం అసలు కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీనికి తోడు అదే సమయానికి నాని హిట్ 3 మూవీ ఉండటంతో భారీగా కలెక్షన్లపై ప్రభావం చూపించింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూర్యకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందని అందరూ భావించారు. కానీ రివర్స్ అయ్యింది.
మొదటి రోజే కలెక్షన్లు భారీగా తగ్గాయి. రెట్రో మూవీ కేవలం రూ.16 కోట్లను రాబట్టింది. అయితే సినిమా మొదటి రోజు ప్రీమియర్స్ నుంచి నెగెటివ్ టాక్ రావడంతో రెట్రో ఓపెనింగ్స్‌పై భారీగా ప్రభావం పడింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. పూజా హెగ్డే యాక్టింగ్ కూడా సినిమాలో బాగుందని టాక్ వినిపిస్తోంది. కనిమా సాంగ్ అయితే మూవీ మొత్తానికి అదుర్స్ అంటున్నారు. వింటేజ్ లుక్‌లో పూజా బాగుంది. అయితే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. పారి చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం కావడంతో తిలక్ అనే గ్యాంగ్‌స్టర్ అతన్ని దత్తత తీసుకుంటాడు. సొంత కొడుకులానే తనని పెంచుకుంటాడు. పారి కూడా ఒక గ్యాంగ్‌స్టర్ అవుతాడు. ఇలా గ్యాంగ్ స్టర్ రుక్మిణిని ప్రేమించి ఆ లైఫ్‌ను వదిలేస్తాడు? తర్వాత ఏమైందనేది సినిమా.