Bellamkonda Srinivas: టాలీవుడ్ హీరోకి బిగ్ షాక్.. ఆ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Bellamkonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ భైరవం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ చుట్టూ ఇప్పుడు ఓ కేసు ఉంది. బెల్లంకొండ శ్రీను రాంగ్ రూట్‌లో వెళ్లడం, ట్రాఫిక్ పోలీస్‌తో గొడవ దిగాడు. అయితే ఇప్పుడు ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బెల్లంకొండ శ్రీను తన ఇంటికి వెళ్తుండగా జర్నలిస్ట్ కాలనీ వద్ద ఈ గొడవ జరిగింది. శ్రీనివాస్ రాంగ్ రూట్‌లో వెళ్తుంటే.. బెల్లంకొండను పోలీస్ లు అతన్ని వారించారు. రాంగ్ రూట్‌లో వెళ్లొద్దని తెలిపారు. కానిస్టేబుల్ చెబుతున్నప్పటికీ కూడా హీరో కనీసం వినలేదు. కానిస్టేబుల్ ను పట్టించుకోకుండా అదే రూట్ లో వెళ్లాడు. దీంతో గొడవ జరిగినట్లు తెలుస్తుంది. సీసీటీవీ కెమెరాలు చూసి అధికారులకు తెలియజేశారు.
ఇది కూడా చూడండి: Kingdom Movie: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ వాయిదా.. కారణమిదే!
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం భైరవం అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ కలిసి నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ మూవీ వస్తోంది. అయితే ఇటీవల దమ్ దమ్మారే పాటను మూవీ టీం రిలీజ్ చేసింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతంది. ఈ క్రమంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వకుండా స్టార్ట్ చేశారు. అయితే మిడ్ రేంజ్ హీరోల మల్టీ స్టారర్ ఎలా ఉంటుందో అని కూడా ఆడియన్స్ ఎంతో గానూ ఎదురు చూస్తున్నారు. మరి వీరు ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో చూడాలి. అయితే ఈ సమ్మర్‌లో సరైన బ్లాక్ బస్టర్ లేదు. ఏ సినిమాకి కూడా సరిగ్గా హిట్ పడలేదు. ఇటీవల విడుదల అయిన హిట్ 3 మూవీ బాగుంది. ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఆశించినంత స్థాయిలో అయితే రాలేదు.
ఇది కూడా చూడండి: Monalisa: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
ఇదిలా ఉండగా.. ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ వారసుడిగా శ్రీనివాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2014లో అల్లుడు శీను మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. డ్యాన్సులు, ఫైట్లుతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత రాక్షసుడు సినిమాతో తన యాక్టింగ్‌ను చూపించాడు. అయితే వీటి తర్వాత బెల్లంకొండకు మంచి విజయాలు దక్కలేదు. ఇప్పుడు భైరవం అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Sitara Zameen Par Trailer: వచ్చేసిన సితారే జమీన్ పర్ ట్రైలర్.. చూసేయండి!