Monalisa: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
Monalisa ఆమె అందానికి ఫిదా అయిపోయిన జనాలు ఆమె ఫోటోలు, వీడియోలు షేర్ చేసి పిచ్చెక్కించేశారు. దాంతో ఆమెకు సినిమా ఛాన్సులు క్యూలో నిలబడ్డాయని అప్పట్లో తెగ అన్నారు.

Monalisa: అది 2025 మహా కుంభమేళా టైం. ప్రయాగ్‌రాజ్ లక్షలాది మందితో కిక్కిరిసిపోయింది. ఆ ఆధ్యాత్మిక గుంపులో ఒక అమ్మాయి అందరి కళ్లను తనవైపే తిప్పుకుంది. కళ్లల్లో ఒకలాంటి మెరుపు, నవ్వులో ఏదో మాయ. సోషల్ మీడియా మొత్తం ఆమె గురించే చర్చ. ఎవరా అమ్మాయి అంటే.. మీరంతా గుర్తుపట్టే ఉంటారు.. ‘వైరల్ గర్ల్’ మోనాలిసా.కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటూ కనిపించిన ఈ పిల్ల ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమె అందానికి ఫిదా అయిపోయిన జనాలు ఆమె ఫోటోలు, వీడియోలు షేర్ చేసి పిచ్చెక్కించేశారు. దాంతో ఆమెకు సినిమా ఛాన్సులు క్యూలో నిలబడ్డాయని అప్పట్లో తెగ అన్నారు.
అయితే ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లకముందే, మోనాలిసా మరో అదిరిపోయే ప్రాజెక్టుతో మీ ముందుకు రాబోతోంది. టాలెంటెడ్ యాక్టర్ ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి ఒక స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది ఈ అమ్మడు. ఆ పాట షూటింగ్ కూడా రీసెంట్‌గా అయిపోయిందట. షూటింగ్ అంతా చాలా కూల్‌గా, ఫన్‍గా జరిగిందని మోనాలిసానే స్వయంగా చెప్పింది. కొన్నాళ్లుగా మీడియాకి మొహం చూపించని మోనాలిసా, ఈ పాట కోసమే మళ్లీ లైమ్‍లైట్లోకి రావడంతో ఆమె కొత్త పిక్స్, వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్‌గా మోనాలిసా ఒక సినిమా సెట్‌లో ఉండగా, ఒక కెమెరామన్ ఆమెతో ఫోటో దిగిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోకి చుట్టూ తిరిగేలోపే 2.7 మిలియన్ల వ్యూస్, 50 వేల లైక్స్ కొట్టేశారు. కానీ నెటిజన్లు మాత్రం మోనాలిసా సినిమా ఏమైందని తెగ అడుగుతున్నారు. “కుంభమేళాలో చూసిన ఆ సింపుల్ అమ్మాయికి, ఇప్పుడు కనిపిస్తున్న ఈ స్టైలిష్ మోనాలిసాకి అస్సలు పోలికే లేదు!” అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఆమెను అంత పెద్ద సెలబ్రిటీలా ఎందుకు చూస్తున్నారో అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఏమైనా, కుంభమేళా అనే ఒక్క సంఘటన ఆమె లైఫ్‌ని టర్న్ చేసేసిందంటున్నారు చాలామంది. ఒక మామూలు అమ్మాయి ఒక్కసారిగా స్టార్ అయిపోవడం నిజంగా గ్రేట్ కదా.
View this post on Instagram
-
Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
-
Money: మెప్పు కోసం అప్పులు చేయకు మిత్రమా.. చేశావో అడుక్కు తింటావ్
-
Anupama Parameswaran: అనుపమ డేటింగ్ చేసేది ఇతనితోనే.. వైరలవుతున్న ఫొటో
-
Monalisa : వామ్మో మోనాలిసా రేంజ్ ఇలా పెరిగిపోయింది ఏంటి? ఏకంగా స్టార్ డైరెక్టర్ తో కేరళ ప్రయాణం.. ఎందుకంటే?