Sitara Zameen Par Trailer: వచ్చేసిన సితారే జమీన్ పర్ ట్రైలర్.. చూసేయండి!

Sitara Zameen Par Trailer: ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే ‘సితారే జమీన్ పర్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాకు అమీర్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తారే జమీన్ పర్’ కి సీక్వెల్. అయితే ఈ మూవీ ట్రైలర్‌ను మొదట మే 8న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విడుదల తేదీని వాయిదా వేశారు. దీంతో మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. అయితే అమీర్ ఖాన్ దాదాపుగా మూడేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. సితారే జమీన్ పర్ మూవీలో అమీర్ ఖాన్ ఓ బాస్కెట్ బాల్ కోచ్‌గా నటిస్తున్నారు. అమీర్ ఖాన్ సరసన జెనీలియా నటించింది. అయితే ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. తారే జమీన్ పర్‌కి సీక్వెల్ మూవీ అయిన సితారే జమీన్ పర్ హిట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ఈ మూవీ టైలర్ మూడు నిమిషాలకు పైగా ఉంది.
ఈ ట్రైలర్‌లో చూస్తే.. అమీర్ ఖాన్ ఇందులో మానసిక దివ్యాంగుల బాస్కెట్ బాల్ టీమ్‌కి కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అయితే అమీర్ ఖాన్ ఒక సాధారణ కోచ్. కాకపోతే ఫుల్‌గా తాగి.. కారు నడిపించి పోలీస్ వాహనాన్ని ఢీకొడతాడు. దీంతో కోర్టుకు వెళ్లా్ల్సి వస్తుంది. ఈ క్రమంలో కోర్టు అమీర్‌ఖాన్‌కి శిక్ష విధిస్తుంది. మూడు నెలల పాటు మానసిక దివ్యాంగుల బాస్కెట్ బాల్ జట్టుకు కోచింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. అలాగే దివ్యాంగులను పిచ్చివాళ్లు అన్నందుకు మరో రూ.5 వేలు జరిమానా కూడా విధిస్తుంది. ఇలా అమీర్‌ఖాన్‌కు సమస్యలు మొదలు అవుతాయి. ఇలాంటి టీమ్‌కు కోచ్‌గా ఉండాలి. అయితే ఇలాంటి టీమ్‌కు ఎలా కోచ్‌గా ఉన్నాడు? ఎలా వ్యవహరించాడు? కష్టాలను ఎలా తట్టుకున్నాడనేది మూవీ స్టోరీ. అయితే 2007లో వచ్చిన తారే జమీన్ పర్ మూవీకి ఇది సీక్వెల్.
ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో సితారే జమీన్ పర్ మూవీ రాబోతుంది. ఈ సినిమా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా 10 మంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. అయితే ఈ సినిమా తారే జమీన్ పర్ మూవీలో కంటే పూర్తి డిఫరెంట్‌గా ఉంటుందని గతంలో అమీర్ ఖాన్ ఒకసారి చెప్పారు. అలాగే సినిమా కామెడీగా కూడా ఉంటుందట. అయితే ఈ సినిమా జూన్ 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ట్రైలర్ కూడా కొత్తగా బాగుందని మూడేళ్ల తర్వాత అమీర్ ఖాన్ మూవీ హిట్ కావడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.