Kingdom Movie: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ వాయిదా.. కారణమిదే!

Kingdom Movie: విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కింగ్‌డమ్. స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య కింగ్‌డమ్ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. అయితే మే 30వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సినిమాను వాయిదా వేశారు. ఈ విషయాన్ని మూవీ టీం స్వయంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కింగ్‌డమ్ మూవీని మే 30వ తేదీ నుంచి జూలై 4కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మే 30వ తేదీనే తీసుకురావాలని ప్రయత్నించామని కాకపోతే.. దేశంలో జరిగిన కొన్ని పరిస్థితులు వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని మూవీ టీం తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్స్ చేయడం, ఈవెంట్స్ నిర్వహించడం చాలా కష్టం. ఈ క్రమంలోనే మూవీని వాయిదా వేసినట్లు మూవీ టీం వెల్లడించింది. సినిమాను జూలై 4న రిలీజ్ చేస్తామని తెలిపింది. అయితే సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా కూడా బ్లాక్ బస్టర్ కావడం పక్కా అని అంటున్నారు. అలాగే విడుదల తేదీ మార్చుకోవడానికి నిర్మాత దిల్‌రాజు సపోర్ట్ చేశారు. దిల్ రాజు, హీరో నితిన్‌కి ధన్యవాదాలని తెలిపారు. ఎందుకంటే జూలై 4న నితిన్ దిల్‌రాజు నిర్మించిన తమ్ముడు మూవీ రిలీజ్ కావాలి. అయితే ఇప్పుడు కింగ్‌డమ్ మూవీ కోసం దీన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇది ఫవర్ ఫుల్ పాత్ర అని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్‌లుక్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యాయి. ఇవి మూవీ అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ‘జెర్సీ’ సినిమాతో పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన కథతో ‘కింగ్‌డమ్’ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని మూవీ మేకర్స్ అంటున్నారు. అయితే ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ అయితే బాగుంది. ప్రేక్షకులు కూడా దీన్ని బాగా ఆదరించారు. విజయ్‌కు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. ఫ్యామిలీ స్టార్ మూవీ ఆశించినంత స్థాయిలో హిట్ కాలేదు. విజయ్ దేవరకొండి ఈ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.