Driving License : రవాణా శాఖ సీరియస్.. చలాన్ మూడు నెలల పాటు పెండింగులో ఉంటే లైసెన్స్ రద్దు..

Driving License : ట్రాఫిక్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర రవాణా శాఖ రెడీగా ఉంది. సీసీటీవీ ఫుటేజీల్లో దొరికి, రూ.వేల కొద్ది జరిమానాలు పడినప్పటికీ, పదే పదే తప్పులు చేస్తున్న వారిని అరికట్టేందుకు ఓ ప్రత్యేక ప్రక్రియను మొదలుపెట్టింది. వరుసగా 3 నెలల పాటు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయాలని ప్రణాళిక వేస్తున్నారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు చేసిన కొత్త ప్రతిపాదనలను రవాణా శాఖ సీరియస్‌గా పరిశీలించింది.
Read Also:Luck by Helping Items: వీటిని దానం చేశారనుకోండి.. ఇక మీ దశ తిరిగినట్లే!
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వాహనదారులపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. గత డిసెంబర్ నుండి ఈ ఏడాది జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో మద్యం సేవించి వాహనం నడిపినవారు, ఓవర్‌స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసిన వారు ఉన్నారు. ఈ సస్పెండ్ అయిన వారిలో 10 వేల మందికి పైగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వారే ఉన్నారు.
Read Also:Tirumala: ఈ దేవుడిని కాదని తిరుమల శ్రీవారిని ముందు దర్శించుకుంటున్నారా.. ఇక మీకు పుణ్యం రాదు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న చాలా మంది చలాన్లు కట్టకుండా తప్పించుకుంటున్నారని అధికారులు గుర్తించారు. చలాన్ జారీ అయిన తర్వాత, ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల ఫోన్ నంబర్‌లకు మెసేజ్ లు పంపుతున్నారు. అయినప్పటికీ, కొందరు వాహనదారులు నెలల తరబడి, ఏళ్ల తరబడి జరిమానాలు చెల్లించడం లేదు. పోలీసుల తనిఖీలలో దొరికినప్పుడల్లా, ప్రతి వాహనంపై రూ.వేల జరిమానాలు పేరుకుపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వాహనదారులు తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని అరికట్టడానికి జరిమానాలను ఎప్పటికప్పుడు వసూలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి వాహనంపై 3 నెలలకు పైగా జరిమానాలు పెండింగ్‌లో ఉంటే, ఆయా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయాలని రవాణా శాఖ అధికారులకు ఒక ప్రతిపాదనను పంపారు. త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.