Financial Freedom:నెలాఖరున డబ్బుల్లేక ఇబ్బందా? ధనవంతులు కావాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి

Financial Freedom: జీతం రాగానే డబ్బులు తెలియకుండానే ఆవిరైపోతున్నాయా.. నెలాఖరున జేబులో రూపాయి కూడా మిగలడం లేదా? ఒకవేళ మీరు కూడా నెలాఖరులో కనీసం పప్పు, అన్నం తినడం కూడా కష్టంగా ఉంటే ఏ మాత్రం ఆందోళన పడొద్దు. ఈ సమస్య మీకు ఒక్కరికే రాలేదు. ఈ బిజీబిజీ గజిబిజీ ప్రపంచంలో డబ్బు ఆదా చేయడం ఎంత ముఖ్యమో, సకాలంలో బిల్లులు కట్టడం కూడా అంతే ముఖ్యం. అయితే, గుడ్ న్యూస్ ఏంటంటే డబ్బు ఆదా చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు మీ జేబులో చాలా డబ్బులు ఉంటాయి. అవేంటో చూద్దాం.
1. విద్యుత్, నీటిని తెలివిగా వాడండి
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఇంకా చాలా మందికి కరెంట్ బిల్లు చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. అయితే తెలివిగా మారాల్సిన సమయం వచ్చింది. ఇంట్లో ఎనర్జీ సేవింగ్ బల్బులు వాడండి. బ్లాక్ అవుట్ కర్టెన్‌లు వాడడం వల్ల ఇంట్లోకి వేడి తక్కువగా వచ్చి, ఏసీ వాడకం తగ్గుతుంది. థర్మోస్టాట్‌ను సరైన ఉష్ణోగ్రతకు సెట్ చేయండి. నీటిని కూడా జాగ్రత్తగా వాడండి. లీకేజీలు ఉన్నాయేమో చూసుకోండి, అవసరం లేకుండా నీటిని వృథా చేయకండి. ఈ చిన్న మార్పులు మీ కరెంట్, నీటి బిల్లులను గణనీయంగా తగ్గిస్తాయి. మీ ఇంటిని కొద్దిగా స్మార్ట్‌గా మార్చుకుంటే బిల్లులు దానంతట అవే తగ్గుముఖం పడుతాయి.
2. మొబైల్ బిల్లును తగ్గించుకోండి
ప్రతి నెలా మొబైల్ బిల్లు కూడా అధికంగా పెరుగుతుంటే ఎక్కువ డేటా వాడకపోతే, తక్కువ డేటా ప్లాన్‌ను వేసుకోవాలి. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి తీసుకునే గ్రూప్ ప్లాన్‌లు కూడా చౌకగా ఉంటాయి. ముఖ్యంగా, పదేపదే కొత్త ఫోన్‌లు కొనే అలవాటును మానుకోవాలి. మీ పాత ఫోన్ కూడా ఇంకా చాలా సంవత్సరాలు పనిచేస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ చిన్న విషయాలను గుర్తుంచుకుంటే, ప్రతి నెలా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
Read Also:Blood Cancer : ఈ 7సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు బ్లడ్ క్యాన్సర్ అవకాశం ఉన్నట్లే
3. బయటి ఆహారం మానేసి, ఇంట్లో తినండి
ప్రతి వీకెండ్లో ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్‌లలో తినడం, ఫుడ్ డెలివరీ యాప్‌లను ఆశ్రయించడం మానుకోవాలి. బయటి ఆహారం ఖరీదైనదే కాకుండా, ఆరోగ్యానికి కూడా హానికరం. ఇంటి వద్ద వంట చేసుకోవడం మంచింది. ఇది చౌకైనదే కాకుండా, కుటుంబంతో మంచి సమయం గడపడానికి కూడా అవకాశం ఇస్తుంది. వారానికి ఒకసారి ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా వండుకోండి. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు.
4. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అలవర్చుకోండి
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మీరు ప్రతిరోజూ మీ కారును బయటికి తీస్తే ఖచ్చితంగా జేబు ఖాళీ అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించుకోవాలి. బస్సులు, మెట్రో లేదా షేరింగ్ క్యాబ్‌లను ఆశ్రయించాలి. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా, ట్రాఫిక్ ఇబ్బందుల నుండి కూడా ఉపశమనం ఇస్తుంది. అంతేకాకుండా, పర్యావరణానికి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి, తదుపరిసారి ఆఫీస్‌కు వెళ్ళేటప్పుడు మెట్రోను ఎక్కండి.
Read Also:Hari hara veera mallu movie: హరి హర వీర మల్లుకు బిగ్ షాక్.. విడుదల కష్టమే!
5. అనవసరమైన సబ్‌స్క్రిప్షన్‌లకు గుడ్‌బై చెప్పండి
ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా మ్యాగజైన్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం డబ్బు చెల్లిస్తున్నారో ఎప్పుడైనా చూసుకున్నారా? వాటిలో ఎన్నింటిని ఉపయోగిస్తున్నారు? చాలా మంది ఉపయోగించని వాటికి కూడా సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకుంటూ ఉంటారు. కాబట్టి, ఇప్పుడు ఈ అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా అలాంటి ఓటీటీలకు గుడ్ బై చెప్పండి.
డబ్బు ఆదా చేయడం పెద్ద కష్టమైన పని కాదు. కేవలం కొద్దిగా ప్లానింగ్, తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ చిట్కాలను మీ జీవితంలో అమలు చేయండి. కచ్చితం మీ నెలాఖరున కూడా డబ్బులు చాలా మిగిలి ఉండడం మీరు చూడొచ్చు.