Bank Holiday: జూన్లో 12 రోజులు బ్యాంకులు బంద్.. ఆ రోజుల్లో పొరపాటున కూడా అటు వెళ్లకండి

Bank Holiday: జూన్ నెలలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే ముందు ఆ రోజు బ్యాంక్ పని చేస్తుందా లేదా అని తెలుసుకోవడం మంచింది. ఎందుకంటే, జూన్ 2025లో భారతదేశంలో బ్యాంకులు మొత్తం 12 రోజుల పాటు మూతపడనున్నాయి. ఇందులో జాతీయ, ప్రాంతీయ పండుగలతో పాటు సాధారణ వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన ఈ సెలవుల జాబితా ప్రకారం.. కస్టమర్లు బ్యాంకులో వారికున్న పనులు చేసుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.
జూన్ 2025 బ్యాంకు సెలవుల లిస్ట్
జూన్ 1 (ఆదివారం): వారపు సెలవు
జూన్ 6 (శుక్రవారం): బక్రీద్ (కేరళలో బ్యాంకులు బంద్)
జూన్ 7 (శనివారం): బక్రీద్ (గుజరాత్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్)
జూన్ 8 (ఆదివారం): వారపు సెలవు
జూన్ 11 (బుధవారం): సంత్ కబీర్ జయంతి / సాగా దావా (సిక్కిం , మేఘాలయలో బ్యాంకులు బంద్)
జూన్ 14 (శనివారం): రెండవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
జూన్ 15 (ఆదివారం): వారపు సెలవు
జూన్ 22 (ఆదివారం): వారపు సెలవు
జూన్ 27 (శుక్రవారం): రథయాత్ర / కాంగ్ (ఒడిశా, మణిపూర్లో బ్యాంకులు బంద్)
జూన్ 28 (శనివారం): నాల్గవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
జూన్ 29 (ఆదివారం): వారపు సెలవు
జూన్ 30 (సోమవారం): రెంనా నీ (మిజోరంలో బ్యాంకులు బంద్)
Read Also:Inverter Types : ఇన్వర్టర్లు ఎన్ని రకాలు? ఏ ఇంటికి ఏది సరైనదో తెలుసా ?
ఈ సెలవులలో కొన్ని రాష్ట్రాలు ఇచ్చే సెలవులు ఉంటాయి. కాబట్టి కస్టమర్లు తమ సంబంధిత రాష్ట్రంలోని బ్యాంక్ సెలవుల జాబితాను చెక్ చేసుకోవాలని సూచించారు. ఉదాహరణకు, కేరళలోని కొచ్చి, తిరువనంతపురంలో జూన్ 6 (శుక్రవారం) నాడు బక్రీద్ సెలవు ఉంది. అయితే జూన్ 7 (శనివారం) నాడు బక్రీద్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి (కొన్ని రాష్ట్రాలు మినహా). ఆ తర్వాత జూన్ 8 (ఆదివారం) వారపు సెలవు ఉంది. అంటే, ఈ నగరాల్లో 3 రోజుల పాటు సుదీర్ఘ వీకెండ్ ఉండవచ్చు.
బ్యాంక్ శాఖలు మూతపడినప్పటికీ యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం (ATM) వంటి డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, చెక్ క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్, పాస్బుక్ అప్డేట్ వంటి కొన్ని సర్వీసులు బ్యాంక్ శాఖల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి ఈ పనులను సమయం ఉన్నప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది.
Read Also:What is KYC : KYC అంటే ఏమిటి? బ్యాంక్ నుంచి మొబైల్ వరకు ప్రతిచోటా ఇది ఎందుకు అవసరం?