Inverter Types : ఇన్వర్టర్లు ఎన్ని రకాలు? ఏ ఇంటికి ఏది సరైనదో తెలుసా ?

Inverter Types : విద్యుత్ కోతలు (పవర్ కట్) సమస్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కామన్ గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఇన్వర్టర్ అనేది చాలా అవసరమైన పరికరంగా మారింది. అయితే, మార్కెట్లో చాలా రకాల ఇన్వర్టర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంటికి ఏ ఇన్వర్టర్ సరైనదో ఏది కొనుగోలు చేస్తే లాభమో తెలుసుకోవడం కష్టంగా మారింది. మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
ఇన్వర్టర్లు ఎన్ని రకాలు?
ఇన్వర్టర్లు ప్రధానంగా మూడు రకాలు. అవి:
1. సైన్ వేవ్ ఇన్వర్టర్ (Sine Wave Inverter):
ఇది అత్యంత స్థిరమైన, నమ్మదగిన ఇన్వర్టర్. ఇది విద్యుత్ సంస్థలు అందించే విద్యుత్ సరఫరాకు దాదాపు సమానంగా విద్యుత్తును అందిస్తుంది. ఫ్రిజ్, ఏసీ, టీవీ, ల్యాప్‌టాప్, వాషింగ్ మెషీన్ వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలకు ఇది ఉత్తమమైనది. ధర కొంచెం ఎక్కువైనా, సురక్షితంగా, దీర్ఘకాలం మన్నుతుంది. ఇంటి వినియోగం కోసం ఇది అత్యుత్తమ ఎంపిక.
2. మోడిఫైడ్ సైన్ వేవ్ ఇన్వర్టర్ (Modified Sine Wave Inverter):
ఇది విద్యుత్ సరఫరాను కొంచెం ‘రఫ్’ గా అందిస్తుంది. సాధారణ ఇంటి అవసరాలైన ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్లైట్ల కోసం ఇది బాగా పనిచేస్తుంది. అయితే, ఎక్కువ లోడ్ లేదా సున్నితమైన ఎలక్ట్రానిక్స్ కోసం ఈ ఇన్వర్టర్ అంతగా సరిపోదు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, చిన్నపాటి ఇంటి పనులకు దీనిని ఉపయోగించవచ్చు.
Read Also:Whatsapp : వాట్సాప్ స్టేటస్‌లో కొత్త రంగులు.. అదరగొట్టే అప్డేట్స్ వచ్చేశాయ్!
3. స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ (Square Wave Inverter):
ఇవి మార్కెట్లో అత్యంత చౌకైన ఇన్వర్టర్లు. వీటి సామర్థ్యం (ఎఫిషియెన్సీ) తక్కువగా ఉంటుంది. ఎక్కువ శబ్దం చేస్తాయి. కేవలం లైట్లు, ఫ్యాన్లు వంటి వాటికి మాత్రమే ఇవి సరిపోతాయి. దీర్ఘకాలిక వినియోగానికి లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఇది సరైన ఎంపిక కాదు. గ్రామాలు లేదా చిన్న కార్యాలయాలలో పరిమిత వస్తువులను నడపడానికి ఉపయోగించవచ్చు.
ఇంటి కోసం ఏ ఇన్వర్టర్ సరైనది?
మీరు ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ల్యాప్‌టాప్, ఫ్యాన్, లైట్లు వంటి వాటిని నడపాలని అనుకుంటే, సైన్ వేవ్ ఇన్వర్టర్ అత్యుత్తమ, సురక్షితమైన ఎంపిక. ఇది తక్కువ శబ్దం చేస్తుంది. ఎక్కువ కాలం పనిచేస్తుంది. విద్యుత్ సరఫరాను సున్నితంగా, సురక్షితంగా అందిస్తుంది.
Read Also:What is KYC : KYC అంటే ఏమిటి? బ్యాంక్ నుంచి మొబైల్ వరకు ప్రతిచోటా ఇది ఎందుకు అవసరం?
ఇన్వర్టర్ కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి?
* పవర్ అవసరం (వాట్స్‌లో): మీరు ఎన్ని పరికరాలను నడపాలనుకుంటున్నారు.. వాటి మొత్తం లోడ్ ఎంత ఉంటుందో లెక్కించాలి. దీని ఆధారంగా ఇన్వర్టర్, బ్యాటరీని ఎంచుకోవాలి.
* బ్యాటరీ టైప్, కెపాసిటీ : ట్యూబులర్ బ్యాటరీలు ఎక్కువ కాలం పనిచేస్తాయి. బ్యాటరీ సామర్థ్యం (Ah) కూడా మీకు ఎంత బ్యాకప్ లభిస్తుందో ప్రభావితం చేస్తుంది.
* బ్రాండ్, వారంటీ: లూమినస్ (Luminous), ఎక్సైడ్ (Exide), మైక్రోటెక్ (Microtek), సు-కామ్ (Su-Kam) వంటి నమ్మదగిన కంపెనీల ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. వారంటీని కూడా పరిశీలించాలి.