What is KYC : KYC అంటే ఏమిటి? బ్యాంక్ నుంచి మొబైల్ వరకు ప్రతిచోటా ఇది ఎందుకు అవసరం?

What is KYC : ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, లేదా ఏదైనా ఆర్థిక సేవలను పొందాలన్నా మొదటగా ‘KYC’పూర్తి చేయాలని అంటుంటారు. అయితే, KYC అంటే ఏమిటి, ఇది ఎందుకు ఇంత ముఖ్యమైందో తెలుసా ? దాని గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.
KYC అంటే ఏమిటి?
KYC అంటే ‘Know Your Customer’ అని అర్థం. తెలుగులో దీని అర్థం “మీ కస్టమర్‌ను తెలుసుకోండి”. ఇది ఒక ప్రక్రియ. ఇందులో ఒక కంపెనీ, బ్యాంక్ లేదా ఏదైనా సర్వీసులను అందించే సంస్థ తమ కస్టమర్ నిజమైన వ్యక్తి అని, ఎవరైనా నకిలీ లేదా మోసం చేసేవారు కాదని నిర్ధారిస్తుంది. ఇది ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పెంచడానికి, మోసాలను నిరోధించడానికి సాయపడుతుంది.
Read Also:Driverless Car : త్వరలో ఇండియాలో డ్రైవర్‌లెస్ కార్ల ట్రయల్స్ ప్రారంభం..ప్రభుత్వం భారీ సన్నాహాలు!
KYC కోసం ఏ డాక్యుమెంట్లు అవసరం?
KYC చేయడానికి మీ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ID కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉంటాయి. ఈ డాక్యుమెంట్ల కాపీలను అందించడం ద్వారా, కొన్నిసార్లు లైవ్ ఫోటో లేదా వీడియో వెరిఫికేషన్ ద్వారా మీ గుర్తింపు కన్ఫాం చేస్తారు.
బ్యాంకులో KYC ఎందుకు అవసరం?
బ్యాంకింగ్ రంగంలో KYC చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మనీ లాండరింగ్ (అక్రమ డబ్బు మార్పిడి), మోసాలను తగ్గించడంలో సాయపడుతుంది. అకౌంట్ తెరుస్తున్న వ్యక్తి నిజంగా ఆ వ్యక్తే అని బ్యాంక్ నిర్ధారిస్తుంది. KYC లేకుండా బ్యాంక్ మీకు పరిమిత సేవలను మాత్రమే అందిస్తుంది. మీరు సమయానికి KYC చేయించకపోతే మీ ఖాతా స్తంభించిపోయే (ఫ్రీజ్ అయ్యే) అవకాశం కూడా ఉంది.
మొబైల్ సిమ్ కొనేటప్పుడు KYC ఎందుకు జరుగుతుంది?
మొబైల్ ఆపరేటర్లు సిమ్ కార్డు నిజమైన వ్యక్తి పేరు మీద ఉందో లేదో తెలుసుకోవాలని అనుకుంటుంది కంపెనీ. ఇది మోసాలు, నకిలీ కాల్స్, స్పామ్ నుంచి రక్షణ కల్పిస్తుంది. సిమ్ యాక్టివేషన్ చేయడానికి ముందు ఇప్పుడు ఆధార్ ఆధారిత eKYC చాలా కామన్. దీనిలో కేవలం OTP ద్వారా గుర్తింపు కన్ఫాం చేస్తారు.
Read Also:Miss World 2025:అందం ఒక్కటే కాదు, మిస్ వరల్డ్ 2025 విజేతను నిర్ణయించే అసలు రహస్యాలు ఇవే!
డిజిటల్ యాప్‌లు, వాలెట్లలో కూడా KYC అవసరం
Paytm, PhonePe, Google Pay లేదా ఏదైనా డిజిటల్ వాలెట్‌ను ఉపయోగిస్తుంటే KYC లేకుండా లిమిటెడ్ ట్రాన్సాక్షన్లను మాత్రమే చేయగలుగుతారు. పూర్తి సేవలను పొందడానికి KYC తప్పనిసరి. ఇది సదరు కస్టమర్ల ఆర్థిక భద్రతను పెంచుతుంది.
KYC ఎన్ని పద్ధతుల్లో జరుగుతుంది?
* KYC ప్రధానంగా మూడు రకాలుగా జరుగుతుంది
* ఫిజికల్ KYC: ఇందులో డాక్యుమెంట్ల ఫోటోకాపీలు, ఫారం నింపి గుర్తింపు ధృవీకరణ చేస్తారు.
* eKYC: ఇది ఆధార్ OTP సహాయంతో జరుగుతుంది. ఇది చాలా వేగవంతమైన ప్రక్రియ.
* వీడియో KYC: ఇందులో లైవ్ వీడియో కాల్ ద్వారా మీ గుర్తింపు కన్ఫాం చేస్తారు.
ఈ ప్రక్రియలన్నీ మీ ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా ఉంచడంలో సాయంగా ఉంటాయి.