Miss World 2025:అందం ఒక్కటే కాదు, మిస్ వరల్డ్ 2025 విజేతను నిర్ణయించే అసలు రహస్యాలు ఇవే!

Miss World 2025:హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ఫైనల్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌పై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ ఏడాది మిస్ వరల్డ్ కిరీటం ఎవరి తల మీద వాలుతుందో అని అంతా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. అయితే, అసలు మిస్ వరల్డ్ అయ్యే ప్రక్రియ ఎలా ఉంటుంది .. కంటెస్టెంట్లు ఈ కిరీటాన్ని దక్కించుకునేందుకు వారు ఎన్ని కఠినమైన రౌండ్లను దాటాల్సి ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.
మిస్ వరల్డ్ కేవలం అందానికి సంబంధించిన పోటీ కాదు. ఇది పోటీదారులు తమ మొత్తం వ్యక్తిత్వాన్ని (overall personality) – అంటే వారి తెలివితేటలు, వారి వ్యక్తిత్వం, సామాజిక సేవా పట్ల వారి అంకితభావాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక వేదిక. ఇది 1951లో బ్రిటన్‌లో ప్రారంభమైంది. మిస్ వరల్డ్ ప్రధాన లక్ష్యం ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ (Beauty with a Purpose). అంటే, మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించడానికి అందంగా కనిపించడం మాత్రమే సరిపోదు. అందంతో పాటు సమాజంలో మార్పు తీసుకురాగల కెపాసిటీ కూడా ఉండాలి.
Read Also:Job Creation : మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఎకానమీ వరకు.. 10ఏళ్లలో 17కోట్ల ఉద్యోగాలు
మిస్ వరల్డ్ ప్రధాన రౌండ్‌లు
మిస్ వరల్డ్ పోటీ అనేక వారాల పాటు కొనసాగుతుంది. అనేక కఠినమైన పరీక్షలను కలిగి ఉంటుంది. ఈ పోటీ ఫైనల్ డేకు ఒక రోజు మాత్రమే ఉంది. అసలు కష్టం అంతకు ముందే ప్రారంభమవుతుంది.
1. జాతీయ అందాల పోటీ (National Beauty Pageant)
ప్రతి దేశం తమ మిస్ ఇండియా తరహాలో తమ దేశంలో జాతీయ పోటీని నిర్వహిస్తుంది. ఇక్కడి నుండే ఒక ప్రతినిధిని మిస్ వరల్డ్‌కు ఎంపిక చేస్తారు. అంటే, అంతర్జాతీయ వేదికపైకి వెళ్ళే ముందు వారు వారి దేశంలో సమర్థులు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
2. ఫాస్ట్-ట్రాక్ ఈవెంట్‌లు (Fast-Track Events)
అంతర్జాతీయ పోటీకి చేరుకున్న తర్వాత కంటెస్టెంట్లు అందరూ అనేక ‘ఫాస్ట్-ట్రాక్ ఈవెంట్‌లు’లో పాల్గొంటారు. ఈ ఈవెంట్‌లలో గెలిచిన పోటీదారులకు నేరుగా సెమీ-ఫైనల్ లేదా క్వార్టర్-ఫైనల్‌కు వెళ్తారు. ఈ ఈవెంట్‌లు చాలా ముఖ్యమైనవి.
* బ్యూటీ విత్ ఎ పర్పస్ (Beauty with a Purpose): ఇది మిస్ వరల్డ్ అత్యంత ముఖ్యమైన విభాగం. ఇందులో పోటీదారులు తమ సామాజిక సేవ, సమాజ సేవా ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. ఇది వారు కేవలం గ్లామరస్‌గా మాత్రమే కాకుండా, సున్నితంగా కూడా ఉన్నారని చూపిస్తుంది. ఉదాహరణకు, ఈ సంవత్సరం భారతదేశం తరపున మిస్ వరల్డ్ పోటీదారు నందిని గుప్తా ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ కింద “ప్రాజెక్ట్ ఏక్తా” అనే ఒక ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ దివ్యాంగుల సమాజాన్ని బలోపేతం చేయడం, వారికి సమాజంలో సమాన స్థానాన్ని కల్పించడంపై దృష్టి సారించింది.
Read Also:Loss of Bladder Control: తెలియకుండానే మూత్రం పడిపోతుందా.. అయితే అది ఈ వ్యాధి లక్షణం కావొచ్చు
* టాలెంట్ రౌండ్ (Talent Round): ఈ రౌండ్‌లో పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఉదాహరణకు పాటలు పాడడం, నృత్యం చేయడం, ఏదైనా వాయిద్యం వాయించడం లేదా మరేదైనా కళలో నిష్ణాతులు అయి ఉండాలి.
* టాప్ మోడల్ (Top Model): ఈ రౌండ్‌లో పోటీదారులు తమ మోడలింగ్ నైపుణ్యాలు, ర్యాంప్ వాక్‌ను ప్రదర్శిస్తారు.
* స్పోర్ట్స్ ఛాలెంజ్ (Sports Challenge): ఈ రౌండ్ అందాల పోటీలో పాల్గొన్న పోటీదారుల శారీరక ఫిట్‌నెస్, క్రీడా స్ఫూర్తిని పరీక్షిస్తుంది.
* హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ (Head-to-Head Challenge): ఇందులో కంటెస్టెంట్లు వేదికపైకి వచ్చి ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల ముందు తమ ఆలోచనలను, సామాజిక సమస్యలపై తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచాలి.
* మల్టీమీడియా ఛాలెంజ్ (Multimedia Challenge): ఇందులో సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల చురుకుదనం, వారి సామర్థ్యం అంచనా వేస్తారు.
Read Also:Pregnant Women : గర్భిణులు పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వాడొచ్చా? డాక్టర్లు ఏమంటున్నారంటే ?
3. క్వార్టర్-ఫైనల్స్, సెమీ-ఫైనల్స్
ప్రారంభంలో ‘మిస్ వరల్డ్’ వంటి పోటీలలో 100 మందికి పైగా పోటీదారులు ఉంటారు. ఫాస్ట్-ట్రాక్ ఈవెంట్‌ల తర్వాత టాప్ 40 మందిని ఎంపిక చేస్తారు. ఇందులో ప్రతి ఖండం (కాంటినెంట్) నుంచి 10 మంది పోటీదారులు ఉంటారు. ఫాస్ట్-ట్రాక్ విజేతలు కూడా ఇందులో ఉంటారు. దీని తర్వాత ప్రతి ఖండం నుంచి టాప్ 5 పోటీదారులను ఎంపిక చేస్తారు. దీనితో టాప్ 20 జాబితా ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ 20 మందిలో నుంచి ప్రతి ఖండం నుండి టాప్ 2 ని ఎంపిక చేస్తారు. దీనితో టాప్ 8 జాబితా ఏర్పడుతుంది.
4. చివరి దశ (Final Stage)
మిస్ వరల్డ్‌కు ఎంపికైన టాప్ 8 కంటెస్టెంట్ల నుంచి ప్రతి ఖండం నుండి ఒక విజేతను ఎంపిక చేస్తారు. వీరిని ‘కాంటినెంటల్ విన్నర్స్’ అని పిలుస్తారు. ఈ నలుగురు కాంటినెంటల్ విన్నర్లే మిస్ వరల్డ్ కిరీటానికి అసలు పోటీదారులు.
గ్రాండ్ ఫినాలే రాత్రి, ఈ టాప్ 4 కాంటినెంటల్ విన్నర్లు చివరి ప్రశ్న-జవాబు రౌండ్ (Final Q&A) ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది వారి తెలివితేటలు, నైపుణ్యాలకు చివరి పరీక్ష. న్యాయనిర్ణేతల తుది నిర్ణయం తర్వాత, మిస్ వరల్డ్, ఫస్ట్ రన్నర్-అప్, సెకండ్ రన్నర్-అప్, థర్డ్ రన్నర్-అప్‌లను ప్రకటిస్తారు.