Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేత ఈమెనే

Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరి ఒపల్ సుచత ఎంపికయ్యారు. ఈమెకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. ఒపల్ సుచత థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో 2003లో మార్చి 20వ తేదీన జన్మించారు. హోటల్ యజమాని కుమార్తెగా ఆమె పెరిగారు. థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషలు ఈమె మాట్లాడుతుంది. బ్యాంకాక్‌లోని ప్రతిష్టాత్మకమైన ట్రయామ్ ఉడోమ్ సుక్సా స్కూల్‌లో ఒపాల్ విద్యాభ్యాసం చేసింది. మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025 గా ఒపల్ కిరీటం పొందింది. 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుండి 31 తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. 2022 లో మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో పాల్గొని, మూడవ రన్నరప్‌గా నిలిచింది. రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపింది.
ที่หนึ่งของโลก เป็นของเธอแล้วนะ 👏🏻👏🏻👏🏻#โอปอลสุชาตา #Opalsuchata #MissWorld #MissWorld2025 #MissWorldThailand2025 pic.twitter.com/prnqKT9Tre
— ˚꒰🐈⬛⤾˚ (@_NARIN0s) May 31, 2025
మిస్ వరల్డ్‌కు మొత్తం 108 దేశాల నుంచి 108 మంది కంటెస్టెంట్లు ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఫైనల్ రౌండ్‌కు కేవలం 40 మందిని ఎంపిక చేశారు. వీరిలో గ్రాండ్ ఫినాలేకు నలుగురు చేరితే.. ఒకరికి మాత్రమే కిరీటం అందజేస్తారు. ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని ఒపల్ సొంతం చేసుకుంది. అయితే బ్యూటీ విత్ పర్పస్‌తో జరిగిన ఈ అందాల పోటీల్లో ఆమె రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన ఇచ్చింది. అయితే ఈ మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుందరి ఒపల్ సుచతకు కిరీటంతో పాటు భారీ ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. $1 మిలియన్ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. దీంతో పాటు ఏడాది పాటు లండన్‌లో ఉచిత నివాసం, డిజైనర్ కాస్టూమ్స్, నగలు, ఆమె మేకప్ కిట్, ఫుట్‌వేర్ అన్ని కూడా ఇస్తారు. వీటితో పాటు స్పాన్సర్ల నుంచి ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇస్తారు. అలాగే బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా పర్యటించవచ్చు.
-
Kedarnath: తక్కువ బడ్జెట్‌లో కేదార్‌నాథ్ వెళ్లడం ఎలా? అయితే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి
-
Miss World: మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
-
Miss World 2025:అందం ఒక్కటే కాదు, మిస్ వరల్డ్ 2025 విజేతను నిర్ణయించే అసలు రహస్యాలు ఇవే!
-
No Theatre Shutdown: థియేటర్ల బంద్ లేదు.. జూన్ 1 నుంచి యథావిధిగా సినిమా ప్రదర్శనలు
-
Car Tax : లగ్జరీ కార్ల దిగుమతి సుంకం తగ్గింపు.. హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల ట్యాక్స్ చోరీ
-
Telangana High Court : పిటీషనర్‌కు రూ.కోటి జరిమానా.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..