Miss World: మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?

Miss World: మిస్ వరల్డ్ ఫైనల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జరుగుతోంది. మొత్తం 108 దేశాల నుంచి 108 మంది కంటెస్టెంట్లు ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఫైనల్ రౌండ్‌కు కేవలం 40 మందిని ఎంపిక చేశారు. వీరిలో గ్రాండ్ ఫినాలేకు నలుగురు చేరితే.. ఒకరికి మాత్రమే కిరీటం సొంతం అవుతుంది. అయితే బ్యూటీ విత్ పర్పస్‌తో జరిగిన ఈ అందాల పోటీలు జరుగుతున్నాయి. మిస్ వరల్డ్ ఎవరో ఈ రోజు తేలిపోతుంది. అయితే ఈ మిస్ వరల్డ్‌లో గెలిచిన వారికి టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. విజేతకు $1 మిలియన్ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. దీంతో పాటు మిస్ ఏడాది పాటు లండన్‌లో ఉచిత నివాసం, డిజైనర్ కాస్టూమ్స్, నగలు, ఆమె మేకప్ కిట్, ఫుట్‌వేర్ అన్ని కూడా ఇస్తారు. వీటితో పాటు స్పాన్సర్ల నుంచి ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇస్తారు. అలాగే బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా పర్యటించవచ్చు. ఈ ఏడాది మిస్ వరల్డ్ ఎవరో మరి కాసేపట్లో తెలియనుంది.
మూడు దశల్లో మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. ఇందులో ఒక్కో ఖండం నుంచి పది మందిని ఎంపిక చేశారు. అమెరికా, కరీబియన్స్ నుంచి 10, ఆఫ్రికా నుంచి 10, ఐరోపా నుంచి 10, ఏషియా, ఓషీనియా నుంచి 10 మందిని ఎంపిక చేశారు. ప్రతి ఖండం నుంచి 10 మందిని ఎంపిక చేసి రెండో దశలో కేవలం ఐదుగురిని ఎంపిక చేశారు. ఈ 5 గురిలో మూడో దశలో ఇద్దరిని మాత్రమే ఎంపిక చేశారు. పోటీలో 8 మంది నిలవగా, ఈ 8 మందిలో సెమీ ఫైనల్లో భాగంగా ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఒకరిని టాపర్‌గా ఫైనలైజ్ చేశారు. అలా ప్రతి ఖండం నుంచి మిగిలిన ఒక్కరి మధ్య ఫైనల్ పోటీ జరగబోతోంది.
ప్రస్తుతం ఫైనల్ లో నిలిచిన నలుగురిలో ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా, యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సెల్మా కామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టినిక్‌కు చెందిన ఆరెలీ జోచిమ్‌లు ఎంపికయ్యారు. అయితే నలుగులో ఒకరిని మాత్రమే విజేతగా ప్రకటిస్తారు. కొత్త విజేతకు గతేడాది మిస్ వరల్డ్ క్రిస్టినా అందాల కిరీటాన్ని ధరింపజేస్తారు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు సీఎం రేవంత్‌తో పాటు పలు పారిశ్రామిక వేత్తలు కూడా హాజరు కానున్నారు. వీరితో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు దాదాపుగా 3,500 మంది హాజరు అయినట్లు తెలుస్తోంది. ఫైనల్ పోటీల్లో ప్రముఖ నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఏటా మిస్ వరల్డ్ ఫైనల్లో ఇచ్చే హ్యుమానిటేరియన్ పురస్కారాన్ని ఈసారి సోనూసూద్‌కు ఇవ్వబోతున్నారు.
ఇది కూడా చూడండి: Kamal Hasan : కన్నడ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు.. థగ్ లైఫ్ సినిమా విడుదలయ్యేనా ?
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే