Telangana High Court : పిటీషనర్‌కు రూ.కోటి జరిమానా.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..
Telangana High Court : కోర్టులు సాధారణంగా నేరం చేసినవారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తాయి. అప్పుడుప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి కూడా జరిమానా విధిస్తాయి.

Telangana High Court : కోర్టులు సాధారణంగా నేరం చేసినవారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తాయి. అప్పుడుప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి కూడా జరిమానా విధిస్తాయి. అయితే తెలంగాణ హైకోర్టు(Telangana High Court) మంగళవారం(మార్చి 18న) సంచలన తీర్పు ఇచ్చింది. పిటిషనర్‌కే రూ.కోటి జరిమానా విధిచింది.
న్యాయస్థానాలు.. విచారణ సమయంలో నేరం రుజువు అయితే నేరస్తులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తాయి. రాజ్యాంగం ప్రకారం శిక్షలు ఉంటాయి. ఇక కోర్టు రూల్స్(Court Rules) అతిక్రమించిన వారికి, కోర్టులను తప్పుదోవ పట్టించిన వారికి కూడా అప్పుడప్పుడు ఫైన్ వేస్తాయి. అయితే తెలంగాణ హైకోర్టు మంగళవారం(మార్చి 18న)ఒక సంచలన తీర్పులో పిటిషనర్‌కు ఏకంగా రూ.కోటి జరిమానా విధించింది. ఈ కేసులో, పిటిషనర్ అయిన వెంకటరామిరెడ్డి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక గుర్తించారు.
ఏం జరిగిందంటే..
హైదరాబాద్ జిల్లాలోని బండ్లగూడ(Bandlaguda) మండలంలో 9.11 ఎకరాల భూమిని తన స్వాధీనంలో ఉంచుకోవడానికి వెంకటరామిరెడ్డి(Venkataramireddy) ప్రభుత్వ అధికారుల నుంచి జోక్యం చేయవద్దని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. దర్యాప్తులో, పిటిషనర్ నకిలీ పత్రాలతో కోర్టును మోసం చేసి, ప్రభుత్వ భూమిని కాజేయాలని చూశాడని తేలింది. ఇది గమనించిన న్యాయమూర్తి, కోర్టు ప్రక్రియల్లో పారదర్శకత అవసరమని, ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. వెంటనే రూ.కోటి జరిమానా విధించారు. ఈ జరిమానా మొత్తాన్ని హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ(Legal Cell Autharity)కి జమ చేయాలని ఆదేశించారు. ఇది కోర్టును మభ్యపెట్టే ప్రయత్నాలపై కఠిన వైఖరిని సూచిస్తూ, ఇతరులకు హెచ్చరికగా నిలిచింది.
గతంలో రూపాయి జరిమానా
2020 ఆగస్టు 31న, భారత సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త అయిన ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు ధిక్కారం(contempt of court) కేసులో దోషిగా నిర్ధారించి, సాంకేతికంగా ఒక రూపాయి జరిమానా విధించింది. ఈ తీర్పును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది. ప్రశాంత్ భూషణ్ జూన్ 2020లో రెండు ట్వీట్లు చేశారు. మొదటి ట్వీట్‌లో, గత ఆరేళ్లలో భారతదేశంలో ప్రజాస్వామ్యం క్షీణించడంలో సుప్రీం కోర్టు, ముఖ్యంగా చివరి నలుగురు ప్రధాన న్యాయమూర్తుల పాత్రను విమర్శించారు. రెండో ట్వీట్‌లో, అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ. బొబ్డే హార్లే డేవిడ్‌సన్ బైక్‌పై కనిపించిన ఫొటోను ఉద్దేశించి, కోర్టు లాక్‌డౌన్‌లో ఉండగా పౌరులకు న్యాయం అందకపోవడంపై వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్లను సుప్రీం కోర్టు “న్యాయవ్యవస్థ గౌరవాన్ని దిగజార్చేలా” ఉన్నాయని భావించి, ఆగస్టు 14న భూషణ్‌ను దోషిగా తేల్చింది.ఆగస్టు 31న జరిమానా విధిస్తూ, కోర్టు ఒక రూపాయి చిహ్నాత్మక జరిమానా విధించింది. దీనిని సెప్టెంబర్ 15లోపు చెల్లించకపోతే, మూడు నెలల జైలు శిక్ష, మూడేళ్ల పాటు న్యాయవాద వృత్తిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది.