Nimishamba alayam: ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరుకుంటే.. నెరవేరడం పక్కా

Nimishamba alayam:
కొందరు మనస్సు ప్రశాంతత కోసం ఆలయాలకు వెళ్తే.. మరికొందరు కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్తుంటారు. కొందరు దేవుళ్లను నమ్మితే మరికొందరు దేవుళ్లను అసలు నమ్మరు. అయితే దేవుడిని నమ్మిన వారు తమ సమస్యలను చెప్పుకుని బాధపడతారు. కోరికలు అన్ని కూడా నెరవేరాలని కోరుకుంటారు. ఈ క్రమంలో ఏ దేవుడు దగ్గర కోరికలు నెరవేరితే వెంటనే అక్కడికి వెళ్తుంటారు. ఈ రోజుల్లో అందరూ కూడా సమస్యల్లోనే ఉన్నారు. అసలు సమస్యలు లేని వారంటూ ఎవరూ లేరు. కొందరు వీటిని తట్టుకుని నిలబడితే మరికొందరు మాత్రం వాటితో యుద్ధాలే చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వాళ్ల సమస్యలను తీర్చుకోవడానికి ఇతరులు చెప్పిన ఆలయాలకు వెళ్తుంటారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఓ ఆలయం కూడా అంతే. ఈ ఆలయంలో ఏదైనా కోరిక కోరుకుంటే చాలా వేగంగా తీరిపోతుంది. ఇంతకీ ఈ ఆలయం హైదరాబాద్‌లో ఎక్కడుంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో నిముషాంబ దేవి అనే ఆలయం ఉంది. ఈ ఆలయంలో కేవలం 16 ప్రదక్షిణలు చేసి కోరిక కోరితే నెరవేరుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక బాధలతో బాధపడుతున్న వారు, అప్పులు ఎక్కువగా ఉన్నవారు నిముషాంబ దేవిని భక్తితో దర్శించుకుని, ప్రదక్షిణాలు చేస్తే చాలు.. మీ కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. అది కూడా ఎక్కువ రోజులు కాదు.. కేవలం 21 రోజుల్లోనే మీ కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. కోరికలు నెరవేరితే మళ్లీ అమ్మవారిని దర్శించుకుని 108 ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఇక్కడి అమ్మవారికి నిమ్మకాయలు పెడుతుంటారు. వీటిని పెడితే అమ్మవారు శాంతిస్తుంది. అమ్మవారిని పూజించిన విగ్రహాలు ఇంటికి తీసుకెళ్తే.. ఇంట్లో అన్ని సమస్యలు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతికూల శక్తులు అన్ని కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ఈ ఆలయంలో నిత్యం కాకులకు ఆహారం కూడా పెడుతుంటారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత కూడా ఉంది. సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఈ ఆలయానికి వెళ్తే కోరికలు అన్ని కూడా ఇట్టే తీరిపోతాయి.
చాలా మందికి మనశ్శాంతి లేకపోవడం వల్ల ఆలయాలకు వెళ్తుంటారు. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రతీ చిన్న విషయానికి ఎక్కువగా టెన్షన్ తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో టెంపుల్‌కి వెళ్తే.. కాస్త మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అన్ని సమస్యల నుంచి కాస్త విముక్తి అనిపిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు అయినా కూడా ఆలయానికి వెళ్లండి. దేవుడి మీద నమ్మకం కంటే మానసిక ప్రశాంతత కోసమైనా ఈ ఆలయానికి వెళ్లండి.