Loss of Bladder Control: తెలియకుండానే మూత్రం పడిపోతుందా.. అయితే అది ఈ వ్యాధి లక్షణం కావొచ్చు

Loss of Bladder Control: సాధారణంగా వయసు మీద పడిన వారికి తెలియకుండానే యూరిప్ పడిపోతూ ఉంటుంది. యూరిన్పై నియంత్రణ కోల్పోవడం అనేది సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే సమస్య. కానీ, కొన్ని వ్యాధుల కారణంగా ఇది ఏ వయసులోనైనా ఇది సంభవించవచ్చు. ముఖ్యంగా పిల్లలు నిద్రలో మూత్రాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. మీకు కూడా యూరిన్పై కంట్రోల్ చేసుకోలేకపోతుంటే తప్పకుండా జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు చాలా ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్య రావచ్చు. అయితే, సాధారణంగా ఇలా జరుగుతుంటే దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి.
యూరిన్పై కంట్రోల్ లేకపోవడం అనేక తీవ్రమైన వ్యాధులకు లక్షణం కావచ్చు. అంతేకాకుండా ఇది కొన్ని వ్యాధులకు ప్రారంభ సంకేతాలు కూడా కావచ్చు. ఈ రకమైన సమస్య ఎదురవుతుంటే.. అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితి కొంతమందికి నలుగురిలో ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. కొన్నిసార్లు మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారిలో కూడా ఈ రకమైన సమస్య కనిపిస్తుంది. ఇది ఏదైనా వ్యాధికి లక్షణమా లేక ఒక వ్యాధికి ఆరంభమా అనే దాని గురించి కొందరు డాక్టర్లు సూచిస్తున్నారు.
Read Also:Viral Video : రైలులో సీటు కోసం రచ్చ.. ప్రయాణీకుల మధ్య వాగ్వాదం
యూరిన్పై నియంత్రణ లేకపోవడం అనేది అనేక వ్యాధులకు ప్రారంభ లక్షణం కావచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. వాటిలో మూత్రాశయ వాపు (సిస్టిటిస్), మూత్రనాళ ఇన్ఫెక్షన్ (యూటీఐ), మూత్రాశయ క్యాన్సర్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా, ఈ సమస్య పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడటం, ఒత్తిడి, కొన్ని వైద్యపరమైన పరిస్థితుల వల్ల కూడా సంభవించవచ్చు. వీటిలో మధుమేహం (డయాబెటిస్), పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS), అలాగే స్ట్రోక్ , కొన్ని సర్జరీలు కూడా యూరిన్పై నియంత్రణ కోల్పోవడానికి కారణం కావచ్చు.
మీరు కూడా యూరిన్ ఆపుకోలేక పోతున్నట్లు అయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. డాక్టర్ పరీక్షల తర్వాత పరిస్థితిని నిర్ధారిస్తారు. యూరిన్పై కంట్రోల్ లేకపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి, చికిత్స ప్రారంభిస్తారు. యూరిన్ రాకుండా ఆగిపోవడం, కంట్రోల్ చేసుకోలేకపోవడం రెండూ తీవ్రమైన పరిస్థితులే అని డాక్టర్ చెబుతున్నారు. ఇలా జరుగుతుంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడానికి కీగల్ వ్యాయామాలు చేయవచ్చు. దీంతోపాటు, తగినంత నీరు తాగడం వల్ల మూత్రాశయం ఖాళీ అవ్వడానికి సహాయపడుతుంది.
Read Also:Viral Video : రైలులో సీటు కోసం రచ్చ.. ప్రయాణీకుల మధ్య వాగ్వాదం