Buying Shares: అప్పు చేసి షేర్లు కొంటున్నారా.. అయితే ఇది మీ కోసమే
ఒక్కసారిగా లక్షాధికారి, కోటీశ్వరుడు అయిపోవాలని చాలా మంది అనుకుంటారు. దీనికోసం డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం రోజుల్లో అయితే చాలా మంది డబ్బు సంపాదించాలని వ్యాపారం, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్నింట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు.

Buying Shares: ఒక్కసారిగా లక్షాధికారి, కోటీశ్వరుడు అయిపోవాలని చాలా మంది అనుకుంటారు. దీనికోసం డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం రోజుల్లో అయితే చాలా మంది డబ్బు సంపాదించాలని వ్యాపారం, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్నింట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో డబ్బులు వస్తాయని కొందరు అప్పు చేసి మరి షేర్లు కొంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో లాభాలు వస్తాయని, దీనివల్ల కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటారని అనుకుంటారు. పిల్లల చదువు, పెళ్లి, ఇంటికి ఇలా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని భావిస్తారు. ఈ క్రమంలో కొందరు లోన్లు తీసుకుని మరి షేర్లు కొంటున్నారు. ఈ తర్వాత లాభాలు వస్తే ఒకే. కానీ నష్టాలు వస్తే మాత్రం కష్టమే. తీసుకున్న లోన్ వడ్డీతో సహా కట్టాలి. ఇటు నష్టాలు.. ఆర్థికంగా టెన్షన్ ఎక్కువ అవుతుంది. డబ్బు టెన్షన్ ఉంటే మాత్రం మానసికంగా ఇబ్బంది పడతారు. ఎక్కువగా యువత తొందరగా డబ్బు సంపాదించాలని ఇలా అప్పు చేసి మరి షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి అప్పు చేసి షేర్లు కొనడం కరెక్టేనా? లేకపోతే ఎలా షేర్లు కొనాలి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Also: ఈ చెట్టు ఆకు వాటర్ తాగితే.. చిటికెలో అనారోగ్య సమస్యలన్నీ పరార్
ప్రస్తుతం యువత ఎక్కువగా షేర్లు వైపు మక్కువ చూపిస్తోంది. అందులోనూ బిట్‌కాయిన్‌లను కొనే వారు అధికం అవుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్, బిట్‌కాయిన్ వంటివి లాభనష్టాలతో ఉంటుంది. ఇందులో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశలు పెట్టుకోకూడదు. నష్టాలు వచ్చిన, లాభాలు వచ్చినా పర్లేదు అనే మైండ్ సెట్‌తో ఉండాలి. అధిక లాభాలు వస్తాయని కొందరు ఆశపడి అప్పు చేసి మరి స్టాక్ మార్కెట్‌లను కొంటారు. సాధారణంగా స్టాక్ మార్కెట్లో 13 నుంచి 15 శాతం వరకే రాబడిని ప్రతీ ఒక్కరూ ఆశించాలి. ఇది కూడా కొన్నిసార్లు కష్టమే. చాలా అరుదుగా లాభాలు వస్తుంటాయి. మీరు లోన్ తీసుకుని సరైన సమయానికి కట్టకపోతే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. దీంతో పాటు వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది.
Read Also: విన్నింగ్ రన్.. కోహ్లీ ఏమోషన్.. ఆర్సీబీ విజయం వీడియో వైరల్
ఆ తర్వాత లాభాల రాకపోతే మీరు అప్పుల పాలు అవుతారు. అదే మీ దగ్గర ఉన్న డబ్బులతో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ లాభం వచ్చినా, నష్టం వచ్చినా కూడా పర్లేదు. అదే అప్పు చేసి మరి ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత నష్టపోతే నిరాశ చెందాల్సి వస్తుంది. అయితే స్టాక్ మార్కెట్లు కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఇందులో చేస్తే లాంగ్ టర్మ్‌లో మంచి లాభాలు వస్తాయి. కనీసం ఏడేళ్ల వ్యవధి ఉన్నట్లు మీరు పెట్టుకుంటే ఇంకా లాభాలు వస్తాయి. అయితే ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఎక్కువ ఏళ్లు పెడితే అంత లాభాలు వస్తాయి. మీరు పది వేలతో కూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు.
-
Dmart: డీ-మార్ట్ భారీ డిస్కౌంట్లు ఎందుకు ఇస్తుందో మీకు తెలుసా?
-
Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్
-
Viral News: మరీ ఇంత దారుణమా.. స్నానం చేసిన నీరు విక్రయించడం.. వైరల్ న్యూస్
-
TVs with Dolby Sound: డాల్బీ సౌండ్‌తో టీవీలు.. ఇక థియేటర్‌కు వెళ్లక్కర్లేదు
-
Personal Loans: సున్నా వడ్డీతో పర్సనల్ లోన్ ఇస్తారా?
-
Invest: మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఎందుకు పెడతారు?