Dosa Batter Tips: ఫ్రిడ్జ్ లేకుండా.. దోశ పిండి ఎక్కువగా నిల్వ ఉంచుకోవడం ఎలా?

Dosa Batter Tips: చాలామందికి దోశ అంటే ఇష్టం ఉంటుంది. రోజూ ఎన్ని టిఫిన్లు ఉన్నా కూడా తప్పకుండా దోశ తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దోశలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే దోశ తయారు చేయాలంటే పెద్ద పని. మినపగుళ్లను నానబెట్టి, మిక్సీ చేసి, దోశ పిండి పులిసిన తర్వాత వేయాలి. డైలీ ఇలా చేయడం అనేది చాలా కష్టం. దీంతో కొందరు దోశ బ్యాటర్‌ను ఒక రెండు లేదా మూడు రోజులకు సరిపడా పెట్టి ఉంచుకుంటారు. దీనివల్ల వెంటనే దోశలను తయారు చేసుకోవచ్చు. అయితే కొందరు ఎలా ఉంచుకున్నా కూడా దోశ బ్యాటర్ స్టాక్ ఉండదు. పెట్టిన రెండు రోజులకే కొందరిది పాడైపోతుంది. మరి దోశ బ్యాటర్ పాడవకుండా ఎక్కువగా రోజులు నిల్వ ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
చాలా మంది దోశ బ్యాటర్ కోసం మినపగుళ్లను నానెబెట్టినప్పుడు ఎక్కువ సమయం పెడతారు. పోనీ మధ్యలో వాటర్ మారుస్తారా అంటే లేదు. ఎప్పుడైనా మీరు ఇలా నానబెట్టాలంటే కేవలం 8 లేదా 9 గంటల పాటు మాత్రమే మార్చాలి. అలాగే మధ్యలో వాటర్ కూడా కనీసం ఒకసారి అయినా మార్చాలి. అలాగే బ్యాటర్‌ను రుబ్బుతున్నప్పుడు అసలు చల్లని వాటర్ వాడకూడదు. కేవలం గోరు వెచ్చని వాటర్ వాడాలి. దీని వల్ల దోశ బ్యాటర్ అంత తొందరగా పులవదు. కనీసం మీరు రెండు రోజులు అయినా కూడా ఫ్రిడ్జ్ లేకుండా నిల్వ ఉంచుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్ అయితే మీరు కనీసం ఒక వారం వరకు నిల్వ చేసుకోవచ్చు.
కొందరు బ్యాటర్ రుబ్బే సమయంలో కొబ్బరి తురుము కలుపుతుంటారు. అయితే దోశలు వేసుకొనేటప్పుడు కొబ్బరి తురుము వేయవచ్చు. కానీ బ్యాటర్ తయారు చేసే సమయంలో అసలు కొబ్బరి తురుము వేయకూడదు. అలాగే మినపగుళ్లుతో పాటు మెంతులు కూడా అందులో కొంచెం కలపడం వల్ల దోశలు రుచిగా వస్తాయి. అలాగే బ్యాటర్ కూడా పులవకుండా ఉంటుంది. కొందరు దోశ బ్యాటర్ రుబ్బిన వెంటనే ఉప్పు, బేకింగ్ సోడా కలుపుతుంటారు. ఇలా కలిపితే ఎక్కువగా దోశ బ్యాటర్ ఉబ్బుతుంది. అయితే దోశలు వేసుకొనేటప్పుడు మాత్రమే వీటిని కలపాలి. దీనివల్ల రుబ్బు పులవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంట్లో ఫ్రిడ్జ్ లేని వారు ఒక పాత్రలో వాటర్ వేసి అందులో దోశ బ్యాటర్‌ను ఉంచడం వల్ల కనీసం ఒక వారం అయినా కూడా దోశ బ్యాటర్ నిల్వ ఉంటుంది. అయితే రోజులో ఒక రెండు లేదా మూడు సార్లు నీటిని మారుస్తూండాలి. అలాగే దోశ బ్యాటర్‌ను మూసి ఉంచాలి. దీనివల్ల తొందరగా బ్యాటర్ పాడవకుండా ఉంటుంది. కాస్త గాలి వెళ్లినా కూడా బ్యాటర్ పుల్లగా మారుతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Jabardasth Nukaraju: వేరే అబ్బాయితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఎక్కి ఎక్కి ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు